Vijay Devarakonda: దుల్కర్‌ సినిమా అలా అవ్వకూడదు.. విజయ్‌ కామెంట్స్‌ ఆ సినిమా మీదనేనా?

‘కింగ్ ఆఫ్ కోథా’ ప్రచారం కోసం హైదరాబాద్‌లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న దుల్కర్‌ సల్మాన్‌ను ‘ఖుషి’తో ఎలాగైనా హిట్‌ కొట్టాలనుకుంటున్న విజయ్‌ దేవరకొండ ఇటీవల కలిశాడు. ‘ఖుషి’ విత్‌ ‘కింగ్‌ ఆఫ్‌ కోథ’ అంటూ ఓ ఇంటర్వ్యూ కూడా డిజైన్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి సినిమాలకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పుకున్నారు. ఈ క్రమంలో విజయ్‌ చెప్పిన మాట ఆసక్తికరంగా మారింది, అదే సమయంలో ‘ఈ జాగ్రత్త అప్పుడుండాలి కదా విజయ్‌’ అనే కామెంట్‌ కూడా పడేలా చేసింది.

‘మహానటి’ సినిమాకు కలసి పని చేసినప్పటి నుండి విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ మంచి మిత్రులు. ఆ అనుబంధంతోనే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరిగింది. అయితే ఆల్‌ ది బెస్ట్‌ చెప్పుకునే క్రమంలో దుల్కర్‌ మాట్లాడుతూ ‘నా గత సినిమా ప్రేమ కథ. ఆ సినిమాలాగా నీ ‘ఖుషి’ కూడా విజయం సాధించాలి’ అన్నాడు. దానికి సమాధానంగా విజయ్‌ మాట్లాడుతూ ‘నా గత సినిమాలా కాకుండా నీ సినిమా మంచి విజయం అందుకోవాలి’ అని కోరాడు. దీంతో ఇప్పుడు ఆ మాటలు వైరల్‌ అయిపోయాయి.

విజయ్‌ (Vijay Devarakonda) గత సినిమా అంటే ‘లైగర్‌’ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఫలితం అతనిని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆయనకు ఫ్లాపే వచ్చి ఉండాలి. కానీ ఆ సినిమా ప్రచారంలో ‘వాట్‌ లగాదేంగే’ అంటూ చేసిన హడావుడి వల్ల చెడ్డ పేరు వచ్చింది. యాటిట్యూడ్‌ చూపిస్తున్నాడు అని విమర్శకులు అంటే.. మరీ అంత అవసరం లేదని పరిశీలకులు అన్నారు. ఇక ట్రోలర్స్‌ అయితే పండగ చేసుకున్నారు.

ఇప్పుడు దుల్కర్‌తో మాట్లాడుతూ ఆ సినిమా బాలేదని చెప్పాడు. అయితే గతంలో ఆ సినిమా ప్రచారం అప్పుడు అంత హడావుడి చేయకపోయుంటే బాగుండేది కదా అని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. అప్పుడు అంతలా అనడం ఇందుకు, సన్నాయి నొక్కులు ఎందుకు అని కామెంట్లు పెడుతున్నారు. మరి విజయ్‌ ఏమంటాడో చూడాలి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus