రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నువ్విలా సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ ఆ తర్వాత కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారి మొదటి సినిమాతోనే హీరోగా మంచి పుట్టినరోజు కొన్నారు. పెళ్లిచూపులు గీతగోవిందం అర్జున్ రెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విజయ్ రౌడీ హీరోగా గుర్తింపు పొంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
అయితే ఆ తర్వాత అన్ని వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సమంత కి జోడిగా ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ మరొక ప్లాప్ నుండి తృటి లో తెప్పించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్న విధంగా ఆ సినిమాలో నటించి ఉంటే విజయ్ కెరీర్లో మరొక ప్లాప్ ఉండేది.
అయితే లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సినిమా ఫ్లాప్ నుండి విజయ్ బయటపడ్డాడు. అసలు విషయం ఏమిటంటే.. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా విడుదలైన తాజా చిత్రం అన్నీ మంచి శకునాలే. మొదట ఈ సినిమా స్టోరీని నందిని రెడ్డి విజయ్ కి వినిపించింది. విజయ్ కూడా ఈ సినిమాలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఆ సమయంలో అర్జున్ రెడ్డి సినిమా విడుదలై (Vijay Devarakonda) విజయ్ రేంజ్ అమాంతం పెరిగి పోవడంతో విజయ్ తో సినిమా వర్కౌట్ కాదని నందిని రెడ్డి భావించి సంతోష్ శోభన్ తో మూవీని తెరకెక్కించింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. ఒకవేళ ఈ సినిమాలో నటించి ఉంటే అర్జున్ రెడ్డి కెరీర్ లో మరొక ప్లాఫ్ వచ్చి చేరేదని అంటున్నారు. నందిని రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల మరొక ప్లాప్ నుండి విజయ్ బయటపడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!