Liger: ఆ సినిమాల తర్వాత స్పెషల్ ఎమోజి సాధించిన చిత్రంగా లైగర్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఇటు పూరి జగన్నాథ్ కు అటు విజయ్ దేవరకొండకు మొదటి పాన్ సినిమా కావడం విశేషం.ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం పలు రాష్ట్రాలలో పర్యటించి పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ అనన్య పాండే ఇద్దరు పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజులు వ్యవధి ఉండటంతో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమాకి యు/ ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరికెక్కిన ఈ సినిమా గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాజాగా ఈ సినిమా కోసం ట్విట్టర్ స్పెషల్ ఎమోజిని క్రియేట్ చేయడం విశేషం. ప్రభాస్ సాహో, యశ్ కేజిఎఫ్ 2,మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల తరువాత విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం ట్విట్టర్ ఈ విధమైనటువంటి స్పెషల్ ఎమోజి క్రియేట్ చేశారు.

ఈ విధంగా ఈ సినిమా కోసం ట్విట్టర్ ఇలాంటి ఎమోజి క్రియేట్ చేయడంతో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఈ విధంగా తమ సినిమా కోసం ట్విట్టర్ స్పెషల్ ఎమోజి క్రియేట్ చేయడంతో లైగర్ చిత్ర బృందం ట్విట్టర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus