Vijay Devarakonda: విజయ్ ఫస్ట్ లవ్ హీరోయినేనా?

  • December 2, 2023 / 04:35 PM IST

సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన గురించి ఎన్నో వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈయన నటి రష్మిక మందనను ప్రేమిస్తున్నారని అయితే ఈ విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి వెకేషన్ లకు వెళ్లడం పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఇక రష్మిక మందన్న సైతం విజయ్ దేవరకొండ తల్లిని నా సెకండ్ మదర్ అని సంబోధించడం

విజయ్ దేవరకొండ ఇంటిని కూడా మా ఇల్లు అంటూ చెప్పడంతో ఈమె ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక విజయ్ దేవరకొండ ఫస్ట్ లవ్ కాదని తెలుస్తుంది. రష్మికను ప్రేమించడానికి కంటే ముందుగానే విజయ్ దేవరకొండ మరొక హీరోయిన్ ప్రేమలో పడ్డారట అయితే

ఆమె అప్పటికే మరొకరిని ప్రేమిస్తున్నటువంటి తరుణంలో ఈయన ప్రేమను రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. మరి విజయ్ దేవరకొండ మొదటిసారి ప్రేమించినటువంటి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరి ఎవరో కాదు నటి రీతు వర్మ. రీతు వర్మ విజయ్ దేవరకొండ ఫస్ట్ లవ్ అని తెలుస్తుంది వీరిద్దరూ కలిసి పెళ్లిచూపులు సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈమెతో ప్రేమలో పడ్డారని

అయితే తన ప్రేమను ప్రపోజ్ చేయగా అప్పటికే వేరొక వ్యక్తితో ప్రేమలో ఉన్నటువంటి రీతు వర్మ తన ప్రేమను రిజెక్ట్ చేశారు అయితే ఈమెను కూడా వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడటంతో తన ప్రియుడుతో బ్రేకప్ జరిగిందని తెలుస్తోంది. ఇలా రీతు వర్మ రిజెక్ట్ చేయడంతోనే ఈయన రష్మిక ప్రేమలో పడ్డారు అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus