విజయ్ దేవరకొండ కెరీర్ కి కీలకంగా మారిన “టాక్సీవాలా”

  • October 25, 2018 / 06:00 AM IST

ఉదయ్ కిరణ్, సిద్ధార్ధ్, వరుణ్ సందేశ్, సాయి ధరమ్ తేజ్… ఇలా వరుసగా విజయాలు అందుకొని ఆ తర్వాత హిట్స్ లేక ఇబ్బంది పడిన… పడుతున్న హీరోల జాబితా చాలా పెద్దదిగానే ఉంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ హిట్ సాధించారు. ఆ తర్వాత చేసిన ద్విభాషా చిత్రం నోటా.. అసలు కూడా రాబట్టలేకపోయింది. దీంతో విజయ్ కూడా ఆ జాబితాలోనే చేరిపోతాడా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వాటికి విజయంతోనే విజయ్ సమాధానం చెప్పాల్సి ఉంది. అందుకే నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వంలో చేసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా’ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు.

ఈ మూవీ ఎలాగైనా హిట్ కావాలనే ఉద్దేశంతో ప్రొడక్షన్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాగా చేశారు. ఈ సినిమా నవంబర్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఇప్పుడు ఈ చిత్రం ఫలితం విజయ్ దేవరకొండ కెరీర్ కి చాలా కీలకంగా మారింది. ఇది విజయం సాధిస్తే స్టార్ హోదా కొనసాగుతుంది. లేదంటే ఇబ్బంది పడక తప్పదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ మూవీ విజయం సాధిస్తుందా..?.. లేదా అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus