Vijay Devarakonda: హిట్ డైరెక్టర్ కి హీరో దొరకడం లేదే!

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు బుచ్చిబాబు సానా. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో బుచ్చిబాబు తన తదుపరి సినిమా స్టార్ హీరోతో చేయాలనుకున్నారు. ఎన్టీఆర్ కి కథ కూడా వినిపించారు. ఆయన కూడా ఓకే చెప్పారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్..

కొరటాల శివ సినిమాను పక్కన పెట్టి బుచ్చిబాబు సినిమాను పట్టాలెక్కిస్తారని వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది. అతడి సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతాయి. ఆ స్థాయికి తగ్గట్లుగా బుచ్చిబాబు స్క్రిప్ట్ లేదని ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ అండ్ కో. దీంతో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ మరో హీరో దగ్గరకు వెళ్లిందని సమాచారం.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండను కలిసిన బుచ్చిబాబు కథ వినిపించారట. కానీ విజయ్ కి కథ నచ్చలేదట. దీంతో ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు విజయ్ దేవరకొండ. ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్కా హిట్ అనుకునే సబ్జెక్ట్ తోనే ముందుకు వెళ్లాలనుకుంటున్నారు.

బుచ్చిబాబు రాసుకున్న స్క్రిప్ట్ లో కొన్ని రిస్క్ ఎలిమెంట్స్ ఉండడంతో విజయ్ లైట్ తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా.. ‘ఉప్పెన’ లాంటి హిట్ తరువాత కూడా బుచ్చిబాబుకి హీరోలు దొరకకపోవడం ఆశ్చర్యంగా ఉంది. స్టార్ హీరోతోనే సినిమా చేయాలని ఆయన పట్టుదలగా ఉంటే మాత్రం ఇప్పట్లో హీరోల డేట్స్ దొరికే ఛాన్స్ లేదు. ఇంకెంతకాలం ఎదురుచూస్తారో మరి!

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus