Vijay Devarakonda: ఆ సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయ్‌!

అప్పటికి గట్టిగా చేసింది రెండు సినిమాలు… ఆర్థికంగా పెద్దగా సంపాదించుకున్నది లేదు. అలాంటి సమయంలో ఓ నిర్మాత వచ్చి నీ పాత సినిమాను ప్రమోట్‌ చేస్తే ₹50 లక్షలు ఇస్తాను అంటే ఎవరైనా నో చెబుతారా? మామూలుగా అయితే ‘నో’ చెప్పరు. కానీ ఈ పరిస్థితి వచ్చింది విజయ్‌ దేవరకొండకు అయితే… కచ్చితంగా నో చెబుతాడు. చెప్పాడు కూడా. కెరీర్‌ తొలి రోజుల్లో జరిగిన ఈ విషయాన్ని ఇటీవల ‘అన్‌స్టాపబుల్‌’ షోలో చెప్పుకొచ్చాడు విజయ్‌. బాలకృష్ణ హోస్ట్‌గా స్ట్రీమ్‌ అవుతున్న ఈ టాక్‌ షోలో ఇటీవల పూరి జగన్నాథ్‌, ఛార్మితో కలసి విజయ్‌ సందడి చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా విజయ్‌ని బాలకృష్ణ తన తొలినాటి రోజుల గురించి అడిగాడు. అప్పుడే ఈ విషయం బయటకు వచ్చింది. విజయ్‌ ‘నువ్విలా’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి సినిమాలు చేసిన రోజులవి. అప్పుడే ‘ఏ మంత్రం వేశావె’ అనే ఓ సినిమా పూర్తి స్థాయి హీరోగా చేశాడు. అయితే ఆ సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు పడింది. అయితే ఈలోగా విజయ్‌ ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలు చేసి యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు. సెన్సేషనల్‌ హీరో అనే ట్యాగ్‌ వచ్చేసింది.

దీంతో ‘ ఏ మంత్రం వేశావె’ సినిమా టీమ్‌ విజయ్‌ దగ్గరకు వచ్చిందట. సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నామని, అయితే సినిమాకు మీరు ప్రచారం చేయాలని అడిగిందట. దీని కోసం ₹50 లక్షలు కూడా ఇస్తామని కూడా చెప్పిందట. కానీ ఇది పద్ధతి కాదని, బాగా రాని సినిమాను ప్రచారం చేయడం తగదని విజయ్‌ వెనుకడుగు వేశాడట. ‘నా ఫేమ్‌ను మీకు క్యాష్‌ చేసుకొని సినిమాకు డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటే సంపాదించుకోండి’ అని తేల్చేశాడట.

అంతేకానీ ఇప్పుడు ఆ సినిమాకు ప్రచారం చేయడం లాంటివి చేయను అని ఖరాఖండిగా చెప్పేశాడట విజయ్‌. అంతేకాదు ఆ సినిమా గురించి ఏం మాట్లాడను అని కూడా అన్నాడట. అనుకున్నట్లుగానే విజయ్‌ ఆ సినిమా గురించి ఏం మాట్లాడలేదు. సినిమా వచ్చింది అలాగే వెళ్లిపోయింది. ఆ విషయం ‘అన్‌స్టాపబుల్‌’ ద్వారా తెలిసింది. అదీ ₹50 లక్షల విషయం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus