సావిత్రిపై సంచలన కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో స్టార్ హీరో హోదా అందుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అతను ట్యాక్సీ వాలా మూవీ చేస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సావిత్రి బయోపిక్ మూవీలోనూ కీలకపాత్ర పోషించారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనిదత్‌ నిర్మించిన ఈ చిత్రం మే9న థియేటర్లోకి రానుంది. సావిత్రిగా కీర్తి సురేష్ కనిపించనున్న ఈ మూవీ టీజర్, ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోపై విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్స్ సంచలనం అయ్యాయి. “వాట్ ఏ కూల్ చిక్’ అని ట్వీట్ పెట్టాడు. దీనికి నెటిజనులు విమర్శలు గుప్పిస్తున్నారు. “చిక్ ఏందిరా.. సీనియర్లకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు” అని ఒకరు… “చిక్ అంటే దవడలు పగులుతాయి.. బోల్డ్‌గా ఉండటం అంటే ప్రతి ఒక్కరినీ బూతులు మాట్లాడటం కాదు. నిర్భయంగా నిజాలు మాట్లాడటం” అని మరొకరు ఇలా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. క్షమాపణ చెప్పాలని కోరారు. దీనికి విజయ్ సమాధానం కూడా వివాదాస్పదంగా మారింది. “సావిత్రి సమాజానికి ఎంతో మంచి చేశారు. ఎవరికీ భయపడేవారు కాదు.

వీటన్నింటికీ మించి ఆమె కూడా ఒక ఆడదే. ప్రేమించాలనుకున్నారు, ప్రేమ పొందాలనుకున్నారు. ఆ తర్వాతే సూపర్‌స్టార్‌ అవ్వాలని కలలు కన్నారు. క్షమాపణ కోరుకునే వాళ్లంతా చెన్నై లీలా ప్యాలెస్‌లో ఉన్నా వచ్చేయండి. నేను మహానటి ఆడియో లాంచ్ ఎంట్రీలు కూడా ఇస్తాను. ఆమె మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మీ లాంటి నైతిక విలువలు ఉన్నవాళ్లూ.. నీతిమంతుల బ్యాచ్ అంతా ఆమెను కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుందని.. తాగుబోతు అని పిలిచారు. ఆమెను తాగుబోతు.. కుటుంబాన్ని పాడు చేసుకుంది అనే కామెంట్లతో పోలిస్తే నేను ‘వాట్ ఏ కూల్ చిక్’ అన్నందుకు ఆమె చాలా సంతోషించి ఉంటారు’’ అని విజయ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాయి. సమంత మధురవాణిగా నటించిన ఈ మూవీలో మోహన్‌బాబు, షాలిని పాండే, ప్రకాశ్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, క్రిష్ తదితరులు ప్రత్యేక పాత్రల్లో కనువిందు చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus