వర్మకు నో చెప్పిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రంపై మొదట అందరూ విమర్శలు గుప్పిస్తే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం అభినందనలు కురిపించారు. ట్వీట్లు చేసి ఆ సినిమా ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు విజయ్ దేవర కొండకి తెలంగాణ పవర్ స్టార్ అంటూ బిరుదు కూడా ఇచ్చారు. ఇంత సహాయం చేసిన వర్మకి విజయ్ ఝలక్ ఇచ్చారు. తన దర్శకత్వంలో నటించమని కోరితే నో చెప్పి షాక్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం నాగార్జునతో ఆఫీసర్ అనే సినిమాని వర్మ తెరకెక్కిస్తున్నారు. 99 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీ మే లో రిలీజ్ కానుంది. దీని తర్వాత వర్మ విజయ్ తో సినిమా తీయాలని అనుకున్నారు. ఆ విషయాన్నీ విజయ్ కి చెబితే ఎగిరి గంతేస్తారని అనుకున్నారు. కానీ డేట్స్ ఖాళీ లేవంటూ ఝలక్ ఇచ్చారు. అర్జున్ రెడ్డి సినిమా హిట్ తో భారీ క్రేజ్ వచ్చింది. వరుసగా సినిమాలకు సైన్ చేశారు. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో “గీతా గోవిందం” అనే సినిమా చేస్తున్నారు. శ్రీరస్తు శుభమస్తుతో హిట్‌ కొట్టిన పరశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

కన్నడ బ్యూటీ రష్మికా మందన హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న నోటా సినిమా షూటింగ్ లో విజయ్ బిజీగా ఉన్నారు. జ్ఞానవేల్ రాజా సమర్పిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాతో పాటు అభినేత్రి సావిత్రి బయోపిక్‌ మూవీ “మహానటి”లో విజయ్ కనిపించనున్నారు. తెలుగు సినిమాలే కాకుండా తమిళ చిత్రం కూడా చేస్తున్నారు. “నడిగయ్యార్‌ తిలగం” అనే చిత్రంలో హీరోగా విజయ్ చేస్తున్నారు. ఈ సినిమాల గురించి విజయ్ వర్మకి చెప్పి శాంతిపజేసినట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus