Vijay Devarakonda: సెన్సేషనల్‌ సినిమా సీక్వెల్స్‌లో విజయ్‌ దేవరకొండ!

‘ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరులే..’ అన్నట్లు సినిమా వాళ్ల మాటలకు అర్థాలు వేరులే అని కూడా అనొచ్చు అంటుంటారు పరిశీలకులు. సినిమా ప్రచారంలో అయినా, సాధారణ ఇంటర్వ్యూల్లో అయినా.. ఒక మాట అన్నారు . అంటే కచ్చితంగా అందులో నిగూఢార్థం ఉంటుంది అంటారు. తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా ఇలాంటి ఆలోచనతోనే చెన్నైలో కామెంట్స్‌ చేశాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘లైగర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా నార్త్‌ నుండి సౌత్‌ వచ్చిన విజయ్‌ రావడం రావడం ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాలతో ఓ సినిమాటిక్‌ యూనివర్స్‌ను ఏర్పాటు చేశారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్. దానికి LCU అని పేరు కూడా పెట్టాడు. దీని కింద చాలా సినిమాలు వస్తాయని చెప్పాడు. LCU అంటే తన సినిమాల్లోని పాత్రలను కలుపుతూ వెళ్లడం. ‘విక్రమ్‌’లో ‘ఖైదీ’ ఢిల్లీతోపాటు ఇతర పాత్రలు ఉన్నట్లు, కథతో కలసి వచ్చినట్లు అన్నమాట. అలా ‘విక్రమ్‌’లోని విక్రమ్‌, సంతానం, రోలెక్స్‌ పాత్రలు తర్వాత వేరే సినిమాల్లో కనిపించడం ఈ యూనివర్స్‌ కాన్సెప్ట్‌. ఇందులో తను కూడా భాగం కావాలని విజయ్‌ కోరుకున్నాడు.

చెన్నైలోని ఓ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ లోకేశ్‌ కనగరాజ్‌ గురించి, అతని పనితనం గురించి చెప్పాడు. పనిలో పనిగా లోకేశ్‌ కనగరాజ్‌ యూనివర్స్‌ (ఎల్‌సీయూ)లో తను కూడా ఓ భాగం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఇది కచ్చితంగా జరుగుతుంది అని కూడా వెల్లడించాడు. దీంతో ఎల్‌సీయూలో విజయ్‌ ఎంట్రీ పక్కా అని టాక్‌ వినిపిస్తోంది. విజయ్‌ నార్మల్‌గానే అన్నాడా? లేక చిన్న హింట్‌ ఇచ్చాడా అనేది ఆలోచిస్తున్న ఫ్యాన్స్.

ఇప్పటికే విజయ్ దేవరకొండ తమిళ మిత్రులకు పరిచయమే. ‘డియర్ కామ్రేడ్’ సినిమా సౌత్‌లో నాలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. దాంతోపాటు ‘నోటా’ అనే సినిమా కూడా చేశాడు. అయితే ఈ రెండు సినిమాలూ డిజాస్టర్లుగా మిగిలాయి. కానీ విజయ్‌ మేనియా మాత్రం దేశం మొత్తం వ్యాపించింది. ఇప్పుడు ‘లైగర్‌’తో వాటిని డబుల్‌ చేయడానికి వస్తున్నాడు. ఇక ఎల్‌సీయూ విషయానికొస్తే.. లోకేశ్‌ కనగరాజ్‌ థళపతి విజయ్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ‘ఖైదీ 2’, ‘విక్రమ్‌ 2’ ఉండొచ్చు. అందులో విజయ్‌ దేవరకొండకి అవకాశం వస్తుందేమో చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus