అమర జవాన్ల కుటుంబాలకి అండగా నిలబడ్డ విజయ్ దేవరకొండ..!
- February 16, 2019 / 01:31 PM ISTByFilmy Focus
జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో సుమారు 42 మందికి పైగా సి.ఆర్.పి.ఎఫ్ జవానులు వీరమరణం పొందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా… ప్రజల్ని విషాదానికి గురిచేసింది. ఆ దుర్మార్గుల్ని ఉరి తీయాలని కొందరు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అలాగే సైనికుల కుటుంబాలకి తమ సానుభూతి తెలుపుతూ కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్,బాలీవుడ్ సినీప్రముఖులు ఈ ఘటన పై తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఇక ఈ క్రమంలో మన సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా చేరాడు.
- దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
- ‘మజిలీ’ టీజర్ రివ్యూ

అయితే మన విజయ్… మరణించిన సైనిక కుటుంబాలకి ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. అంతేకాదు వీరమరణం పొందిన జవానుల కుటుంబాలను ఆదుకోవడానికి అందరికీ పిలుపునివ్వడం విశేషం. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. ”జవానులు మన కుటుంబాల్నిరక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము… కానీ అండగా నిలబడాల్సిన బాధ్యత మన పై ఉంది. నా వంతు నేను సాయం చేశాను. మీరు కూడా మీ వంతు సాయం చేసి వారికి అండగా నిలబడదాం” అంటూ విజయ్ పేర్కొన్నాడు. మరి విజయ్ ట్వీట్ కి స్పందించి ఎవరెవరు ముందుకు వస్తారో చూడాలి. ఇక నెటిజెన్లు మాత్రం విజయ్ పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు.












