Journalist Murthy: వేణు స్వామి దంపతుల ఆరోపణలపై స్పందించిన జర్నలిస్ట్ మూర్తి..!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అందరికీ సుపరిచితమే. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఇతను ఫేమస్ అయ్యాడు. అతను చెప్పినవన్నీ జరగలేదు కానీ.. కొన్ని జరిగిపోయిన తర్వాత ‘నేను ముందే చెప్పాను’ అని ఇతను పలు యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పుకోవడం వల్ల.. ఇతను బాగా ఫేమస్ అయ్యాడు అని చెప్పాలి. ముఖ్యంగా నాగ చైతన్య (Naga Chaitanya)  – సమంత  (Samantha)   విడిపోతారు అని ఇతను చెప్పిన గాల్లో మాటలు నిజమయ్యాయి. అందుకు ఇతన్ని కొంతమంది ఎక్కువగా నమ్ముతారు.

Journalist Murthy

అయితే ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల ఫలితాల విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల విషయంలో కావచ్చు, అలాగే ప్రభాస్ సినిమాల ఫలితాల విషయంలో కావచ్చు.. ఇతను చెప్పిన ప్రెడిక్షన్స్ తప్పయ్యాయి. అందువల్ల ఇతన్ని సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ దెబ్బకి ఇతను మళ్ళీ ప్రెడిక్షన్స్ వంటివి చెప్పాను అని అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. అయితే ఇటీవల నాగ చైతన్య- శోభిత (Sobhita Dhulipala) ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు.. వాళ్ళు కూడా విడిపోతారు అంటూ ప్రెడిక్షన్ చెప్పాడు.

‘ఇంకా పెళ్లి కూడా కాకముందే విడిపోతారు’ అని చాలా మంది ఇతన్ని విమర్శించడం జరిగింది. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కమ్ దర్శకుడు అయినటువంటి మూర్తి దేవగుప్తపు… ప్రశ్నించడం జరిగింది. ‘అసలు పుట్టిన తేదీ, రాశి వంటివి మ్యాచ్ అవ్వకుండా జాతకం చెప్పి ఎవర్ని మోసం చేద్దాం అనుకుంటున్నావు’ ఆయన వేణు స్వామిని ప్రశ్నించడం జరిగింది. దీంతో వేణు స్వామి అలాగే ఆయన సతీమణి వీణా శ్రీవాణి… ‘తమని జర్నలిస్ట్ మూర్తి (Journalist Murthy) రూ.5 కోట్లు లంచం అడిగాడని.

అంత డబ్బు మా దగ్గర లేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామని’ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందుకు సాక్ష్యంగా ఓ ఆడియో క్లిప్ ను కూడా వారు షేర్ చేశారు. దీంతో సీనియర్ జర్నలిస్ట్ మూర్తి (Journalist Murthy) రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడం జరిగింది.’నా 30 ఏళ్ల జర్నలిస్ట్ కెరీర్లో ఎవ్వరినీ కూడా టీ, కాఫీ..లకి కూడా డబ్బులు అడగలేదు. ఒకవేళ నేను వాళ్ళని రూ.5 కోట్లు లంచం అడిగానని ప్రూవ్ అయితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి. కానీ వల్ల మాయలో పడకండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మూర్తి.

పెళ్లి డేట్ ని లీక్ చేసిన కిరణ్ అబ్బవరం.. వీడియో వైరల్. !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus