ఆ విషయంలో మహేష్ ని ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ

వరుసగా మూడు హిట్స్ అందుకోవడంతో విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. అతను ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో “నోటా” అనే ద్వి భాష చిత్రాన్ని చేస్తున్నారు. నాజ‌ర్, స‌త్య‌రాజ్ కీల‌క‌పాత్ర‌లు పోషించిన ఇందులో మెహ్రీన్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో నటించింది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ ప‌తాకంపై నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల 5 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లోకి నోటా చిత్ర బృందం దిగేసింది. అయితే రొటీన్ గా  ప్రీ రిలీజ్ వేడుక‌లంటూ నిర్వహించడం బోర్ గా ఫీల్ అయ్యారేమోగానీ.. మహేష్ రూట్ ని ఎంచుకున్నారు.

భరత్ అనే నేను సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆ చిత్రానికి సంబంధించిన వేడుకని బహిరంగ సభ పేరుతో నిర్వహించారు. ఆ సభ హిట్ అయింది.. సినిమా సూపర్ హిట్ అయింది. అందుకే నోటా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ కావ‌డం వల్ల ‌‌”ది నోటా ప‌బ్లిక్ మీట్” తో ప్రీ రిలీజ్ వేడుకని నిర్వ‌హించ‌నున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 30న విజ‌య‌వాడ‌.. అక్టోబ‌ర్ 1న హైద‌రాబాద్‌లో ఈ మీటింగులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సభలు హిట్ అయితే సినిమా కూడా హిట్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. ఏమి జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus