Vijay Deverakonda: టికెట్ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్… విజయ్ దేవరకొండ రియాక్షన్స్
- October 12, 2026 / 04:00 PM ISTByFilmy Focus Desk
సినిమాల విడుదలకు ముందు చాలామంది హీరోల్లాగే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా మీడియా ముందుకు వస్తాడు. అయితే వాళ్లు స్పందిస్తారు. విజయ్ ఆ స్పందనతోపాటు ఏదో ఒకటి మాట్లాడి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాడు. మొన్నీమధ్య ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఇలా మాట్లాడి.. గతాన్ని తవ్వేలా చేసుకున్నాడు. అయితే ఇటీవల మరోసారి మీడియా ముందుకు వచ్చి.. చాలా అంశాలపై రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Vijay Deverakonda
నా సినిమాలకు టికెట్ ధరల పెంపు వద్దని నా సినిమాల నిర్మాతలకు చెబుతుంటాను అంటూ తన యంగ్ ఏజ్‌లో జరిగిన విషయాల గురించి చెప్పాడు. తన కాలేజ్ రోజుల్లో వాళ్ల నాన్న రోజూ రూ.10 ఇచ్చేవారట. ఆ డబ్బులను దాచుకుని, వారమయ్యాక ఐమ్యాక్స్‌లో సినిమా చూసేవాడట. ఒకసారి టికెట్ ధరను రూ.100కు పెంచేశారట. దాంతో అలా ఎలా పెంచేస్తారని బాధపడ్డాడట. అందుకే హీరో అయ్యాక టికెట్ ధరల పెంపు వద్దంటున్నాడట. అయితే రాజమౌళితో సినిమా చేస్తే అప్పుడు పెంచమంటాడట.

బయోపిక్‌లు చేయడం అంటే ఇష్టమని చెప్పిన విజయ్.. (Vijay Deverakonda) ఎప్పటి నుండో సత్యసాయి బాబా బయోపిక్ చేయాలనుకుంటున్నాడట. అయితే సత్యసాయిలోని స్వచ్ఛత, సున్నితత్వం తనలో లేవట. అందుకే చేయలేదట. నాకు సరిపోయే వేరే బయోపిక్ వస్తే చేస్తాడట. రష్మికతో సినిమా చేయమని చాలా మంది కథలు చెప్పారట. కానీ, నేను తానొప్పుకోలేదట. ఎందుకంటే అన్నిసార్లు మేజిక్ రిపీట్ కాదు. ఈ సినిమాలో భార్యభర్తల్లా కనిపించాల్సి వచ్చింది కాబట్టే చేశా అని చెప్పాడు విజయ్.

తన చదువు అంతా పుట్టపర్తిలోనే సాగిందని, అందుకే రాయలసీమ మాండలికం బాగా తెలుసని తెలిపాడు. ఈ సినిమా అందుకే తనకు ఈజీగా అనిపించిందన్నాడు. ఇప్పటికీ తన స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఆ యాసలోనే మాట్లాడతా అని చెప్పాడు. ఒకప్పుడు విలన్‌లకు తెలంగాణ యాస, ఫ్యాక్షనిస్ట్‌లకు రాయలసీమ, కమెడియన్‌లకు గోదావరి యాస పెడుతూ పాత్రలను సృష్టించారని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలిపాడు.
హీరోయిన్ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయిన శ్రీకాంత్ కుమార్తె…
















