Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర గట్టిగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి రాహుల్ సాంకృత్యాన్ తో చేస్తున్న పీరియాడిక్ డ్రామా (VD14) అయితే, మరొకటి రవికిరణ్ కోలాతో చేస్తున్న మాస్ మసాలా సినిమా. ఈ రెండింటిలో ఏది ముందు వస్తుంది అనేదానిపై ఇన్నాళ్లు రకరకాల ఊహాగానాలు నడిచాయి. కానీ ఇప్పుడు విజయ్ తీసుకున్న నిర్ణయంతో ఆ సస్పెన్స్ కి తెరపడింది.

Vijay Deverakonda

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ తన పూర్తి దృష్టిని రవికిరణ్ కోలా సినిమా మీదే పెట్టారు. దీనికోసం ఏకంగా రాబోయే నాలుగు నెలల పాటు బల్క్ డేట్స్ కేటాయించారట. అంటే మధ్యలో గ్యాప్ లేకుండా, వేరే సినిమా షూటింగ్ కి వెళ్లకుండా ఏకధాటిగా ఈ సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ లుక్, యాటిట్యూడ్ చాలా కొత్తగా ఉంటాయని టాక్ నడుస్తోంది.

దీంతో రాహుల్ VD14 కాస్త వెనక్కి వెళ్లక తప్పని పరిస్థితి. ప్రస్తుతం విజయ్ ప్లానింగ్ చూస్తుంటే, ఈ మాస్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశాకే, ఆ పీరియాడిక్ డ్రామాపై ఫోకస్ పెడతారని అర్థమవుతోంది. నిర్మాత దిల్ రాజు కూడా ఇటీవల స్పందిస్తూ, ఈ సినిమాను 2026లో పక్కాగా థియేటర్లలోకి తెస్తామని క్లారిటీ ఇచ్చారు. అంటే వచ్చే ఏడాది విజయ్ నుంచి రాబోయే ఫస్ట్ రిలీజ్ ఇదేనన్నమాట.

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర బృందం, త్వరలోనే క్లైమాక్స్ ఎపిసోడ్ ను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వారిద్దరి కాంబినేషన్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా దర్శకుడు రవికిరణ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. ఏదేమైనా విజయ్ రూట్ క్లియర్ అయ్యింది. క్లాస్, పీరియాడిక్ ప్రయోగాల కంటే ముందు, ఒక మాస్ కమర్షియల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయాలని డిసైడ్ అయ్యారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus