Jana Nayagan: దళపతి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ‘జననాయగన్’ రిలీజ్‌కు మళ్ళీ బ్రేక్!
- January 27, 2026 / 07:32 PM ISTByFilmy Focus Writer
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘జననాయగన్’ మూవీకి కష్టాలు ఇప్పట్లో వదిలేలా లేవు. పొలిటికల్ ఎంట్రీకి ముందు విజయ్ చేస్తున్న లాస్ట్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి, కానీ సీన్ కట్ చేస్తే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కింది. సెన్సార్ విషయంలో వస్తున్న చిక్కుల వల్ల సినిమా విడుదల మరోసారి డైలమాలో పడింది.
Jana Nayagan
నిజానికి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సెన్సార్ బోర్డు ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో కథ మొత్తం రివర్స్ అయింది. తాజాగా డివిజన్ బెంచ్ పాత తీర్పును రద్దు చేసి, ఈ ఇష్యూని మళ్ళీ మొదటి నుంచి విచారించాలని సింగిల్ బెంచ్‌కే పంపింది. అంటే ఇప్పుడు సెన్సార్ పంచాయితీ మళ్ళీ మొదటికి వచ్చిందన్నమాట.
ఈ గ్యాప్‌లో నిర్మాతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లినా పెద్దగా రిజల్ట్ లేకుండా పోయింది. అక్కడ కూడా స్టే ఎత్తేయడానికి కోర్టు నో చెప్పడంతో, ఇప్పుడు మొత్తం వ్యవహారం మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఇచ్చే లేటెస్ట్ తీర్పును బట్టే విజయ్ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ వస్తుంది. అప్పటివరకు ఈ పొలిటికల్ థ్రిల్లర్ కోసం వెయిటింగ్ తప్పదు.
వరుసగా జరుగుతున్న ఈ న్యాయపోరాటం చూస్తుంటే, దళపతి చివరి సినిమాకు అడ్డంకులు మామూలుగా లేవని అర్థమవుతోంది. మరి సింగిల్ బెంచ్ ఈసారైనా మేకర్స్‌కు ఫేవర్‌గా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి. సినిమా రిలీజ్ లేట్ అయ్యే కొద్దీ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెరుగుతోంది. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.














