ఇళయదళపతి విజయ్ సంక్రాంతి పండక్కి మాస్టర్ గా వచ్చి సాలిడ్ హిట్ ని అందుకున్నాడు. సినిమా టాక్ పరంగా యావరేజ్ అని వచ్చినా కూడా కలక్షన్స్ పరంగా మాత్రం భారీగానే కలక్ట్ చేసింది. ముఖ్యంగా తెలుగులో విజయ్ కి హైఎస్ట్ మార్కెట్ ని తెచ్చిపెట్టింది ఈ సినిమా. అయితే, రిలీజ్ కి ఒకరోజు ముందే మాస్టర్ సినిమా మొత్తం లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఎవరు చేశారు అని ఎంక్వైరీ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు ఒక డిజిటల్ కంపెనీపై కేసు వేసి సెన్సేషన్ కి తెరలేపింది.
మాస్టర్ సినిమా కాపీని విదేశాలకి పంపించేందుకు చిత్రయూనిట్ ఒక డిజిటల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడే సినిమాని ఎవరో లీక్ చేశారని, సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసింది. అంతేకాదు, ఆ డిజిటల్ కంపెనీపై ఏకంగా 25కోట్ల పరిహారాన్ని కోరుతూ నిర్మాత లలిత్ కుమార్ నోటీసులు పంపించారు. ఇప్పుడు ఈ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఎంతో శ్రమించి తీసిన ఈ సినిమాని పైరసీ చేసి తమకి చాలా నష్టం కలిగించారని,
అలాగే మున్ముందు ఏ సినిమాకి కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీస్కున్నట్లుగా నిర్మాతలు చెప్తున్నారు. మొత్తానికి కలక్షన్స్ పరంగా చూస్తే , మాస్టర్ సినిమా 150కోట్ల మార్క్ ని దాటి ఇప్పుడు 200కోట్ల క్లబ్ లోకి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.