ప్రముఖ తమిళ దర్శకుడు చంద్రశేఖర్ తనయుడు విజయ్. అతను తమిళంలో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. విజయ్ తెలుగులోనూ విజయం సాధించాలని అనేక ప్రయత్నాలు చేశారు. కానీ హిట్ సాధించలేకపోయారు. అయినా తన సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే మాత్రం సూపర్ హిట్టే. అటువంటి సినిమాలపై ఫోకస్..
శుభాకాంక్షలు తమిళంలో విజయ్ నటించిన పూవే ఉనక్కాగ అనే సినిమాను తెలుగులో జగపతి బాబుతో శుభాకాంక్షలు గా రీమేక్ చేశారు. ఇది సూపర్ హిట్ గా నిలిచింది. కొన్ని థియేటర్లలో 400 రోజులు ఆడింది.
సుస్వాగతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి కమర్షియల్ హిట్ అయిన సుస్వాగతం కూడా విజయ్ సినిమా కథే. లవ్ టుడే పేరుతో అక్కడ విజయం సాధించిన అనంతరం తెలుగులో తీశారు.
నువ్వు వస్తావని..!నాగార్జునకు క్లాసికల్ హిట్ ఇచ్చిన మూవీ నువ్వు వస్తావని..!. ఈ కథతో ముందుగానే విజయ్ హిట్ కొట్టారు. ఆ కథ తో నాగ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఖుషీ పవన్ ఫాలోయింగ్ ని అమాంతం పెంచిన సినిమా ఖుషి. ఇది కూడా విజయ్ సినిమాకి రీమేక్. తమిళ కథకు కొన్ని మార్పులు చేసి పవన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
అన్నవరం తమిళంలో విజయ్ నటించిన అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలిపే మూవీ తిరుప్పాచ్చి. ఈ కథతో పవన్ అన్నవరం మూవీ చేశారు. ఇది యావరేజ్ గా నిలిచింది.
స్నేహమంటే ఇదేరా నాగార్జున, సుమంత్ నటించిన స్నేహమంటే ఇదేరా సినిమా కూడా విజయ్ సినిమాకి రీమేక్. అయితే ఈ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది.
ఖైదీ నంబర్ 150 చిరంజీవి రీ ఎంట్రీ కోసం ఎన్నో కథలను పరిశీలిస్తుంటే విజయ్ సినిమా కత్తి మూవీ చిరుకి హాట్ కేక్ లా కనిపించింది. ఆ కథ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమాలతో పాటు సమంత హీరోగా నటించిన గౌరీ, కళ్యాణ్ రామ్ విజయ దశమి సినిమాలు కూడా విజయ్ చిత్రాలకు రీమేక్ లే.