Vijay Sethupathi: క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు.. రియాక్ట్‌ అయిన విజయ్‌ సేతుపతి.. ఏమన్నాడంటే?

సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి గత కొన్నేళ్లుగా విమర్శలు, క్లారిటీలు వస్తూనే ఉన్నాయి. కొంతమంది విమర్శలు వస్తే ఊహించడం కష్టం, కానీ కొంతమంది మీద ఆ ఆరోపణలు నమ్మేయాలి అనేలా ఉంటాయి. తొలి రకం విమర్శ ఒకటి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు అలాంటి పుకార్లు కానీ, ఆరోపణలు రాలేదు. ఈ క్రమంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలపై విజయ్‌ సేతుపతి ఏమంటారు అనే ఆసక్తి అయితే అందరిలోనూ ఉంది. తాజాగా ఆయన ‘సార్‌ మేడమ్‌’ సినిమా ప్రచారంలో భాగంగా బయటకు వచ్చి ఈ విషయంలో స్పందించారు.

Vijay Sethupathi

సినీ నేపథ్యం లేకుండా కోలీవుడ్‌కి వచ్చి ఇప్పుడు స్టార్‌ యాక్టర్‌గా ఎదిగాడు విజయ్‌ సేతుపతి. అలాంటి విజయ్‌పై ఇటీవల ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఆ పోస్టులో కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎక్కువగా ఉందని రాసుకొచ్చింది. తన స్నేహితురాలు ఎంతో ఇబ్బందిపడిందని అనే ఓ మహిళ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. విజయ్‌ సేతుపతి కూడా ఆమెను ఇబ్బందిపెట్టారని తెలిపింది. తన స్నేహితురాలు మానసికంగా కుంగుబాటుకు గురైందని కూడా పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఆ పోస్ట్‌ను తర్వాత డిలీట్‌ చేసింది.

దీంతో ఈ విషయాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ విషయంలో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ఈ విషయంలో తన కుటుంబం ఎంతో బాధ పడిందని చెప్పుకొచ్చారు. ఆమె ఆరోపణలు చూసి.. నన్ను ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వారంతా నవ్వుకున్నారు. నేనేంటో వారికి తెలుసు, నాకు కూడా తెలుసు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు నన్ను బాధించలేవు. కానీ నా కుటుంబం, సన్నిహితులు ఈ విషయంలో కలత చెందారు. అయితే ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోకండి. ఆమె ఫేమస్‌ అవ్వడం కోసం కావాలని ఇలా చేస్తోంది.

ఇలా చేస్తే కొన్ని నిమిషాల పాటు ఆమె హైలైట్‌ అవుతుంది. పాపం ఎంజాయ్‌ చేయనీయండి అని నా సన్నిహితులకు చెప్పాను. ఇప్పుడు అందరికీ అదే మాట చెబుతున్నాను. ఆమెపై సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం. ఏడేళ్లుగా ఈ పరిశ్రమలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకూ దేనికీ భయపడలేదు. ఇలాంటి విషయలు ఎప్పటికీ నన్ను బాధించవు అని కూడా విజయ్‌ చెప్పుకొచ్చాడు.

‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus