Chiranjeevi, Vijay Sethupathi: ‘వాల్తేరు వీరయ్య’కి విలన్‌గా మక్కళ్‌ సెల్వన్‌!

  • May 31, 2022 / 05:49 PM IST

విజయ్‌ సేతుపతి మాస్‌ విలనిజం సూపర్‌గా ఉంటుంది. కోలీవుడ్‌ సినిమాల్లో ఇప్పటికే మనం చూశాం కూడా. ఆ బాడీ లాంగ్వేజ్‌, యాటిట్యూడ్‌, లుక్‌ అన్నీ అదిరిపోతాయ్‌. అయితే స్ట్రయిట్‌ తెలుగు సినిమాల్లో ఆ అవకాశం రాలేదు. ‘ఉప్పెన’ సినిమాలో విలన్‌గా కనిపించినా.. ఆ ఫీలింగ్‌ వేరు. దీంతో మక్కళ్‌ సెల్వన్‌ అసలు సిసలు విలనిజం చూద్దామని ఎదురుచూసే వారికి ఇన్నాళ్లూ ఎదురుచూపులే అవుతున్నాయి. అయితే వాటికి ఇప్పుడు బ్రేక్‌ పడనుందట.

విజయ్‌ సేతుపతి ఫుల్‌ ప్లెడ్జ్‌ విలనిజాన్ని చూపించడానికి టాలీవుడ్‌లో ఓ సినిమా రెడీ అవ్వబోతోంది. అందులోనూ విలన్‌ – హీరో ఫేస్‌ ఆఫ్‌ మామూలుగా ఉండదు. ఎందుకంటే విజయ్‌ సేతుపతి విలన్‌గా చేయబోతోంది ఎవరితోనో కాదు మెగాస్టార్‌ చిరంజీవితో. అదిరిపోయింది కదా ప్రాజెక్ట్‌. ఈ మైటీ కాంబినేషన్‌ను ప్రస్తుతం సెట్‌ చేసే పని నడుస్తోందట. అన్నీ అనుకున్నట్లుగా సాగితే వీరయ్యతో పోరాడేది విజయ్‌ సేతుపతినే. కేఎస్‌ రవీంద్ర అలియాస్‌ బాబీ దర్శకత్వంలో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.

నిజానికి దీన్ని మెగా 154 అని రాయాలి. కానీ చిరంజీవే సినిమా పేరు లీక్‌ చేసేశారు కాబట్టి పేరు రాసేశాం. ఈ సినిమాలో చిరంజీవికి విలన్‌గా విజయ్‌ సేతుపతిని అనుకుంటున్నారట. త్వరలో మలేసియాలో మొదలవ్వబోయే కొత్త షెడ్యూల్‌లో విజయ్‌తో సీన్స్‌ చిత్రీకరిస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. విజయ్ సేతుపతి గతంలో ‘సైరా’ సినిమాలో చిరంజీవికి అనుచరుడిగా కనిపించారు. కనిపించింది కాసేపు అయినా అదిరిపోయే స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకున్నారు.

ఇప్పుడు పూర్తిస్థాయి పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఇక ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవికి సోదరుడిగా రవితేజ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడని సమాచారం. అలాగే ఈ చిత్రంలో చిరు సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. చిరంజీవిని అభిమాని ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అలా చూపిస్తానని బాబీ గతంలో చెప్పారు. ప్రీ లుక్‌లో అయితే ఆ బజ్‌ కనిపించింది. మరి సినిమాలో ఏం చేస్తారో చూడాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus