Vijay Sethupathi, Ram Charan: ఇంకా బాక్సాఫీస్ బద్దలే..మెగా ఫ్యాన్స్ కి పునకాలే..

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్ కేటాయించారు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రంలో వినయ విధేయ రామ తర్వాత హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.

అలాగే తెలుగమ్మాయి,హీరోయిన్ అంజలి కూడా సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంప్లీట్ కాగానే రామ్ చరణ్.. ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కూడా నడుస్తోంది.

త్వరలోనే మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ ప్రాజెక్టు గురించి పలు రకాలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త హల్ చల్ చేస్తుంది. ఈ వార్త విన్న మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. బుచ్చిబాబు, చెర్రీ కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.

అయితే ఈ సినిమాలో తమిళ వర్సటైల్ యాక్టర్ (Vijay Sethupathi) విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బుచ్చిబాబు ఇప్పటికే ఓ పవర్ ఫుల్ ప్యాక్డ్ పాత్రను డిజైన్ చేశారని సమాచారం. కాకపోతే దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి అధికార సమాచారం లేదు. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీసుకు ఈ సినిమా షేక్ చేయడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus