Vijay Sethupathi: తండ్రిలా భావించే అమ్మాయితో రొమాన్స్ ఎలా చేస్తా.. నటుడి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే నటించినా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటుడిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు. ఉప్పెన (Uppena) సినిమా సక్సెస్ తో తెలుగునాట విజయ్ సేతుపతి పేరు మారుమ్రోగింది. అయితే ఒక సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా కృతిశెట్టి (Krithi Shetty) పేరును పరిశీలించగా కృతిశెట్టి తన సినిమాలో హీరోయిన్ గా వద్దని విజయ్ సేతుపతి రిజెక్ట్ చేయడం జరిగింది. అలా రిజెక్ట్ చేయడం గురించి విజయ్ సేతుపతి మరోసారి రియాక్ట్ అయ్యారు.

నేను నటించిన డీఎస్పీ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్ గా తీసుకుంటే చేయలేనని చెప్పానని విజయ్ సేతుపతి అన్నారు. ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించడం వల్లే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వెల్లడించారు. ఉప్పెన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. కూతురిగా నటించిన అమ్మాయితో రొమాన్స్ చేయలేనని అందుకే వద్దని చిత్రయూనిట్ కు చెప్పానని ఆయన వెల్లడించారు.

ఉప్పెన సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరిగే సమయంలో కృతిశెట్టి కంగారు పడిందని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. ఆ సమయంలో కృతితో నాకు నీ వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడని నన్ను నీ తండ్రిగా భావించు అని ధైర్యం చెప్పానని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. నేను కూతురిగా భావించిన కృతి నాకు జోడీగా నటించడం నా వల్ల కాదని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.

విజయ్ సేతుపతి మహారాజ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే రిలీజైన మహారాజ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ సేతుపతి తన సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ విజయ్ సేతుపతి కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus