క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ జీవితం డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోని జీవితం ఆధారంగా అతడి పేరుతో బయోపిక్ వచ్చింది. అందులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించారు. ఇప్పుడు మరో క్రికెటర్ బయోపిక్ తెరపైకి రాబోతుంది. మణికట్టు మాంత్రికుడు, శ్రీలంక కు అనేక విజయాలు అందించిన స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరకెక్కుతోంది. ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి అందులో ముత్తయ్య మురళీధరన్ క్యారెక్టర్ లో యాక్ట్ చెయ్యనున్నారు.
ఎమ్మెస్ శ్రీపతి డైరెక్షన్ లో ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ బయోపిక్ ప్రొడ్యూస్ చెయ్యనున్నాయి. పాన్ ఇండియా లో రిలీజ్ తో పాటు శ్రీలంకలో రిలీజ్ చేసేలా తీస్తారట. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘ఉప్పెన’లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. అంతకుముందు ‘సైరా’లో ఆయన యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సహా మిగతా భాషల్లో విజయ్ సేతుపతి గుర్తింపు ఉండడంతో పాటు ముత్తయ్య మురళీధరన్ క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతాడు అని అతన్ని తీసుకున్నారట.