Vijay Sethupathi: సినిమాల ఎంపిక విషయంలో విజయ్‌ సేతుపతి కీలక నిర్ణయం… చాలామంది నిరాశే!

విజయ్‌ సేతుపతి… సౌత్‌లో ఇటీవల కాలంలో దొరికిన కంప్లీట్‌ యాక్టర్‌ అని చెప్పాలి. ఎలాంటి పాత్ర అయినా… తాను మాత్రమే చేయగలడు అనేంతలా తన నటనతో మెప్పించాడు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎలాంటి పాత్రలు చేసి మెప్పించాడో… విలన్‌గా అంతకుమించిన నటనా వైవిధ్యంతో మెప్పించాడు. అయితే ఇప్పుడు పాత్రల ఎంపిక విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అదే జరిగితే చాలామంది దర్శకుల ఆలోచనలకు బ్రేక్‌ పడినట్లే అవుతుంది. విజయ్‌ సేతుపతి ఇటీవల షారుఖ్‌ ఖాన్‌ ‘జవాన్‌’ సినిమాలో విలన్‌గా అలరించాడు.

గోవాలో జరుగుతున్న ‘ఇఫి’ వేడుకల్లో పాల్గొన్న (Vijay Sethupathi) విజయ్‌ సేతుపతి కొన్నేళ్లపాటు విలన్‌ పాత్రలు చేయకూడదు అనుకుంటున్నాడట. ఎమోషనల్ ప్రెజర్‌ కారణంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పాడు. తమ సినిమాలో విలన్‌గా నటించమని హీరోలు, దర్శకులు నాకు ఫోన్‌ చేసి అడిగేవారు. కొంతమంది అయితే నాపై ఎమోషనల్‌ ప్రెజర్‌ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పాడు విజయ్ సేతుపతి. అలాంటి ఎమోషనల్‌ ప్రెజర్‌ను నేను ఫేస్‌ చేయాలని అనుకోవడం లేదు.

అయితే విలన్‌ పాత్రలు చేయడానికి నాకు బాధేమీ లేదు కానీ… కొంతమంది ఆంక్షలు పెట్టి నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు అని ఓ విషయం చెప్పారు. హీరోకు మించి చేయకూడదు అంటూ నన్ను కంట్రోల్ చేస్తున్నారు. పైగా కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్‌లో పోతున్నాయి. దీంతో ఇలాంటి పాత్రలు చేయాలా? వద్దా? అనే విషయంలో అయోమయంలో పడ్డాను అని క్లారిటీ ఇచ్చాడు. అందుకే కొన్నేళ్ల పాటు విలన్‌ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని తేల్చిచెప్పాడు.

అయితే విలన్‌ పాత్రలు చేయను అని ఎవరికైనా చెప్తే కనీసం స్క్రిప్ట్ అయినా వినండి అంటున్నారని, అక్కడే మళ్లీ సమస్య మొదలవుతుంది అని విజయ్‌ సేతుపతి అన్నాడు. ఈ నేపథ్యంలో విజయ్‌ సేతుపతి కోసం నెగిటివ్‌ రోల్స్‌ రాసుకున్న దర్శకులు, రచయితలకు ఇది షాకింగ్‌ న్యూస్‌ అని చెప్పాలి. తెలుగులో కూడా విజయ్‌ సేతుపతి కోసం కొన్ని రోల్స్‌ ఇప్పటికే ఆఫర్‌ చేశారు. మరి అవి ఆయన చేస్తారా, నో చెప్పారా అనేది తెలియాలి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus