అప్పుడే పెద్ద రిస్క్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా సినిమాలు చేస్తూనే వరుస హిట్లు కూడా అందుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. కథా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక ‘సైరా’ చిత్రంలో కూడా ఓ నటిస్తున్నాడు. మెగాస్టార్ చిత్రం కాబట్టి త్వరగానే గుర్తింపు వస్తుంది. అలాగే మరో మెగా హీరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ కృతి శెట్టికి తండ్రిగా విజయ్ సేతుపతి కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్రంలో విజయ్ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండటంతో పాటు కథలో కీలకంగా ఉంటుందట. ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తాడని సమాచారం. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus