Vijay Sethupathi: విజయ్ సేతుపతి కామెంట్స్ ను వైరల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ మహేశ్ బాబు నటించిన అతడు (Athadu)  సినిమాను రిపీట్ మోడ్ లో తాను చూశానని పేర్కొన్నారు. తాను కష్టాల్లో ఉండి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో అతడు సినిమాను మళ్లీమళ్లీ చూడటం జరిగిందని చెప్పుకొచ్చారు. అతడు సినిమాలో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ప్రతి సీన్ వరకు గుర్తేనని విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అన్నారు.

Vijay Sethupathi

ఆ సినిమాలో ఎమోషన్స్ ను త్రివిక్రమ్ (Trivikram)  అద్భుతంగా చూపించారని ఆయన తెలిపారు. మహేష్ త్రిష (Trisha)  మధ్య రొమాన్స్ నాకు నచ్చిందని విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కామెంట్లు చేశారు. బ్రహ్మానందం కామెడీ సీన్స్, సాంగ్స్ అన్నీ ఇష్టమని ఆయన పేర్కొన్నారు. విజయ్ సేతుపతి చెప్పిన విషయాలను మహేష్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. బుల్లితెరపై ఎక్కువసార్లు ప్రదర్శితమైన సినిమాలలో అతడు సినిమా ఒకటి కాగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి.

స్టార్ మా ఛానల్ కు మంచి పేరును తెచ్చిపెట్టిన సినిమాలలో అతడు కూడా ఒకటి కావడం గమనార్హం. విజయ్ సేతుపతి తెలుగు సినిమాలు కూడా చూస్తారని తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు విజయ్ సేతుపతి కాంబో కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఈ కాంబో సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు మహేష్ రాజమౌళి (Rajamouli)  కాంబో సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం కొసమెరుపు.

రవితేజకు కొత్త టైటిల్‌ రెడీ.. అది బిరుదుగా మార్చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus