విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కెరీర్లో 50వ సినిమాగా రూపొందింది ‘మహారాజ’ (Maharaja) సినిమా. అనురాగ్ కశ్యప్, అభిరామి (Abhirami) , మమతా మోహన్ దాస్ (Mamta Mohandas)..లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ నెలలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రూ.20 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.120 కోట్ల(గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓటీటీ రైట్స్, డబ్బింగ్ రైట్స్ కూడా మంచి రేట్లకే అమ్ముడయ్యాయి.
Maharaja
విజయ్ సేతుపతి ల్యాండ్ మార్క్ మూవీ బ్లాక్ బస్టర్ ఫలితాన్నే అందుకుంది. ఈ నవంబర్ 29న ‘మహారాజ’ సినిమా చైనాలో రిలీజ్ అయ్యింది. దాదాపు 6 నెలల తర్వాత చైనాలో రిలీజ్ అయితే.. అక్కడేం వసూళ్లు వస్తాయిలే అని అంతా అనుకున్నారు..! కానీ కట్ చేస్తే మొదటిరోజు అక్కడ ప్రీమియర్స్ తో కలుపుకుని 10.56 మిలియన్ల యన్స్(అక్కడి కరెన్సీ ప్రకారం) ను కలెక్ట్ చేసింది. అంటే అమెరికన్ డాలర్స్ ప్రకారం $1.465 మిలియన్లు అని సమాచారం.
మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్కుంటే.. రూ.12.34 కోట్ల గ్రాస్ అనమాట. ఇంత గ్యాప్ తర్వాత రిలీజ్ అయినా చైనాలో ‘మహారాజ’ (Maharaja) ఈ రేంజ్లో కలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. చూస్తుంటే అక్కడ ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ‘మహారాజ’ సినిమా కథ విషయానికి వస్తే.. ‘ ఓ యాక్సిడెంట్లో భార్యను కోల్పోయి.. తర్వాత కూతురితో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు.
ఓ చెత్త బుట్ట వల్ల తన కూతురు యాక్సిడెంట్ నుండి ప్రాణాలతో బయట పడింది అని భావించి.. ఆ చెత్త బుట్టని లక్ష్మిలా పూజిస్తూ ఉంటాడు. అయితే అది మిస్ అయ్యింది అని భావించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. కానీ పోలీస్ స్టేషన్లో అంతా ఇతన్ని పిచ్చోడిలా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత అవమానించినా వాటిని తట్టుకుని పోలీస్ స్టేషన్లోనే తిరుగుతూ ఉంటాడు. దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?’ అనేది మిగిలిన కథ.