Vijay Thalapathy: తమిళవాళ్లు మొదలెట్టేశారు… మరి మనమెప్పుడు?

ఎందులోనైనా మనమే ముందుండాలి అనుకుంటాం. అలాగే మనవాళ్లు ముందుండాలి అని అనుకుంటాం. అయితే ఓ విషయంలో మాత్రం మీరు ముందు కానిచ్చేయండి తర్వాత మేమొస్తాం అని అంటున్నట్లు అనిపిస్తోంది. ఇది మన గురించి అనుకుంటున్న మాట కాదు. మనకు సంబంధించి టాలీవుడ్‌ ఇండస్ట్రీ గురించి అంటున్న మాట. సినిమా నటీనటుల కోసం ఓ భవనం కావాలని చాలా రోజులుగా టాలీవుడ్‌, కోలీవుడ్‌ అనుకుంటున్నాయి. అయితే మన దగ్గర ‘మా’ భవనం గురించి ఇంకా ఈ విషయంలో ఓ అడుగు పడలేదు.

కానీ నడిగర్‌ సంఘం మాత్రం పనులు షురూ చేసింది. విరాళాలు సేకరిస్తోంది కూడా. తమిళ స్టార్‌ హీరో (Thalapathy Vijay) విజయ్‌ ‘సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ అలియాస్‌ నడిగర్‌ సంఘం భవన నిర్మాణం కోసం రూ.కోటి విరాళం అందించారు. ఈ మేరకు విశాల్‌ (Vishal) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. విజయ్‌కి కృతజ్ఞతలు చెబుతూ అతనితో దిగిన ఫొటోను విశాల్‌ షేర్‌ చేశాడు.

‘‘థ్యాంక్యూ అన్నది కేవలం రెండు పదాలే కావొచ్చు. కానీ, హృదయం లోపలి నుండి వచ్చే ఆ మాటకు విశాలమైన భావన ఉంటుంది. నా అభిమాన నటుడు, అత్యంత ఆప్తుడు విజయ్‌ రూ.కోటి విరాళం ఇచ్చారు’’ అని విశాల్‌ తెలిపారు. మీ సహకారం, ప్రమేయం లేకుండా భవన నిర్మాణం పూర్తి కాదు. త్వరలోనే మన కాల సాకారం కాబోతోంది అని విశాల్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో మరోసారి ‘మా’ భవనం గురించి చర్చ బయటకు వచ్చింది.

మన భవనం ఎప్పుడు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎప్పుడో ఈ పనులు మొదలవ్వాలి. అయితే ఎందుకో కానీ అవ్వడం లేదు. ప్రస్తుతం ‘మా’ కార్యవర్గం టెన్యూర్‌ త్వరలో పూర్తవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు వస్తాయి. అందులో కూడా ‘మా’ భవనమే కీలక ప్రచారాంశం అవుతుంది అని చెప్పొచ్చు. ఈసారి పోటీలో ఎవరుంటారు, ఏం చెబుతారు, ఏం అవుతుంది అనేది చూడాలి. గత ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఈ విషయంలో చర్చ జరిగింది.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus