Vijay: విజయ్‌ కొత్త సినిమా పేరు ఇదే… ఈసారి పక్కా అంటూ…!

విజయ్‌ – వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దళపతి 68 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో కొన్ని ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. అందులో ఎక్కువ శాతం ఈ సినిమా టైటిల్‌ గురించే ఉంటున్నాయి. సినిమాకు ఓ రెండు పేర్లు దాదాపు అనుకున్నారని, అందులో ఒకటి ఫైనల్‌ చేస్తారు అనేది ఆ పుకార్ల సారాంశం. అయితే ఆ రెండూ కాదు అని నిర్మాత చెప్పేశారు.

ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌ ఇదే అంటూ మరో పేరు బయటికొచ్చింది. అయితే ఈ పేరు సినిమా సన్నిహిత వర్గాల నుండే వచ్చింది అని కోడంబాక్కం వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ సినిమాకు ‘గోట్’ అనే పేరు పెడతారు అని చెబుతున్నారు. అంటే ‘గ్రేటెస్ట్‌ వన్‌ అక్రాస్ టైమ్స్‌’ అని అర్థం అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి గతంలో వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఇదేదో టైమ్‌ ట్రావెల్‌ సినిమా అన్నారు. మరి ఈ పేరు ఎందుకో చూడాలి.

ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో టైటిల్‌గా ‘G.O.A.T’ అని పెడతారని సమాచారం. తొలుత ఈ సినిమాకు ‘బాస్‌’, ‘పజిల్‌’ లాంటి పేర్లు పెడతారని వార్తలొచ్చాయి. అయితే ‘గోట్‌’ ఖరారైనట్టే అని చెబుతున్నారు. త్వరలో దర్శకనిర్మాతలు ఈ విషయంలో క్లారిటీ ఇస్తారట. మామూలుగా సినిమాలయందు వెంకట్‌ ప్రభు సినిమాలు వేరయా! అంటుంటారు. ఇంకా సూటిగా చెప్పాలంటే సినిమాల పేర్ల యందు… వెంకట్‌ ప్రభు సినిమాల పేర్లు వేరయా అని చెప్పాలి.

అలా ఈ సినిమాకు కూడా డిఫరెంట్‌ పేరు, ట్యాగ్‌లైన్‌ సిద్ధం చేశారని పుకార్ల బట్టి అర్థమవుతోంది. ‘బాస్‌’, ‘పజిల్‌’ పేర్ల విషయంలో ఆ సినిమా నిర్మాత అర్చన కలపతి ఖండించారు. మరి కొత్త పేరు విషయంలో ఏమంటారో చూడాలి. జనవరి 1న సినిమా టైటిల్‌తో స్పెషల్‌ వీడియో వస్తుంది అని అంటున్నారు. అప్పుడు రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ రావొచ్చు. ఇక ఈ సినిమాలో ప్రశాంత్‌, ప్రభుదేవా, లైలా, స్నేహ, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus