Vijay: తెలుగు రీమేక్‌ల లక్‌ కోసం విజయ్‌ చూస్తున్నాడా? ఏ సినిమా అంటే?

దళపతి విజయ్‌కి స్టార్‌డమ్‌ వెనుక తెలుగు చిత్రాల ప్రభావం ఎక్కువగానే ఉందనే విషయం మీకు తెలిసే ఉంటుంది. విజయ్‌ కెరీర్‌లో భారీ విజయాలు అందుకున్న ‘పొక్కిరి’, ‘గిల్లి’, ‘బద్రి’, ‘ఆది’ లాంటి సినిమాలకు మాతృక తెలుగు సినిమాలే. ఆ చిత్రాలే విజయ్‌ కెరీర్‌ను మలుపు తిప్పాయి అంటారు. అంతలా తెలుగు రీమేక్‌లు చేసి విజయాలు అందుకున్న విజయ్‌ మరోసారి తెలుగు సినిమా రీమక్‌ చేయడానికి సిద్ధమవుతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

దళపతి విజయ్ ఇటీవలే రాజకీయ నాయకుడి అవతారమెత్తాడు. ‘తమిళగ వెట్రి కళగం’ అంటూ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీని ఎన్నికల బరిలో నిలపడం లేదు అని చెప్పి షాక్‌ ఇచ్చారు. అదేంటి పొలిటికల్‌ ఎంట్రీ షాక్‌ కదా అంటారా? అది ఏ మాత్రం షాక్‌ కాదు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా విజయ్‌ ఆ దిశగా తన అభిమానుల్ని నడిపిస్తూ… ఆయన కూడా నడుస్తున్నాడు. కాబట్టి ఇమ్మీడియట్‌ ఎంట్రీ లేకపోవడమే షాక్‌.

ఆ విషయం పక్కనపెడితే.. విజయ్‌ (Vijay) త్వరలో ఓ తెలుగు నిర్మాతతో సినిమా చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ మేరకు అడ్వాన్స్‌లు ఇవ్వడం కూడా అయిపోయింది అంటున్నారు. అయితే ఆ సినిమాకు డైరెక్ట్‌ చేసేది ఎవరు, అసలు ఆ సినిమా కథేంటి అనే విషయంలో ఎలాంటి లీకులు రావడం లేదు. అయితే ఈ రోజు తాజాగా ఆ సినిమా ఓ రీమేక్‌ అని అంటున్నారు. అంతే కాదు ఆ మాతృక సినిమా ‘భగవంత్‌ కేసరి’ అంటున్నారు.

నందమూరి బాలకృష్ణ – అనిల్‌ రావిపూడి కాంబినేషన్లో గతేడాది వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ కథలో పాయింట్‌ నచ్చడంతో రీమేక్‌ చేయడానికి విజయ్‌ ముందకొస్తున్నాడు అని అంటున్నారు. అయితే మెయిన్‌ పాయింట్‌ను తీసుకొని దానికి కాస్త పొలిటికల్‌ టచ్‌ ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారట. అంటే తన నెక్స్ట్‌ పొలిటికల్‌ లైఫ్‌కి ఉపయోగపడేలా చూసుకుంటున్నారని చెబుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus