Vijay Varma: అంతా చెబుతున్నారు కానీ.. అసలు విషయం చెప్పడం లేదుగా.. తేల్చండబ్బా!

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ల వరకు ‘రిలేషన్‌ ఉంది’ అనే మాట మనం విన్లేదు. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ అన్ని వుడ్స్‌ తిరిగేస్తూ ఉంది. రిలేషన్‌షిప్స్‌కి అడ్డా అయిన బాలీవుడ్‌కి వెళ్లినా ఆ వాస అంటలేదు అని గొప్పగా చెప్పుకున్నారు ఆమె అభిమానులు. అయితే ‘లస్ట్ స్టోరీస్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత మొత్తం మారిపోయింది. ఆ సిరీస్‌ నేపథ్యంలో తమన్నా  (Tamannaah) – విజయ్‌ వర్మ (Vijay Varma) కలిశారు. అక్కడ పరిచయమై కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. సుమారు రెండేళ్ల పాటు సాగిన ఈ ప్రేమ ఆగిపోయిందని సమాచారం.

Vijay Varma:

తమన్నా – విజయ్‌ వర్మ జోడీ విడిపోయిందని, బ్రేకప్‌ చెప్పేసుకున్నారు అని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు వైరల్‌గా మారిన తరుణంలో విజయ్‌ వర్మ రిలేషన్‌షిప్‌ను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిలేషన్‌షిప్‌లోని ప్రతి విషయాన్ని ఆనందించాలని చెప్పిన విజయ్‌ వర్మ.. ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకొనే సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా స్వీకరించాలని చెప్పుకొచ్చారు. రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్‌ మాదిరిగా ఆద్యంతం ఆస్వాదించాలని, అలా చేసినప్పుడే సంతోషంగా ఉండగలం అని చెప్పాడు విజయ్‌ వర్మ.

సంతోషం, బాధ, కోపం, చిరాకు.. ఇలా ప్రతి అంశాన్ని మనం స్వీకరించాలి. దాంతోపాటే ముందుకుసాగాలి అని పిలుపునిచ్చారు. మరోవైపు తమన్నా ఇటీవల ప్రేమ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. నిస్వార్థమైన ప్రేమను నమ్ముతానని, అయితే ప్రేమను వ్యాపార లావాదేవీగా చూడటం మొదలుపెడితే అప్పుడే అసలు సమస్యలొస్తాయని చెప్పింది. రిలేషన్‌లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే ఆనందంగా ఉన్నానని కూడా చెప్పుకొచ్చింది.

జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక కూడా చేసింది. ఇద్దరి మాటలు వింటుంటే రిలేషన్‌‘షిప్‌’ మునిగిపోయింది అని అర్థమవుతోంది. అయితే ఎవరు కారణం, ఏంటి కారణం అనేది మనం అడగలేం, వాళ్లు చెప్పరు కూడా. కాబట్టి ఇద్దరూ కలసి ఇకపై స్టేజీలు షేర్‌ చేసుకోవడాలు, ఫొటోలు షేర్‌ చేసుకోవడాలూ ఇకపై ఉండవు.

‘ప్రేమించుకుందాం రా’ అని వెంకటేశ్‌ పిలవాల్సింది అంజలా జవేరిని కాదట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus