Vijay Varma: జ్యోతిష్యుడు వద్దని చెబితే సినిమా నుంచి తీసేసారు!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ వర్మ ఒకరు. ఈయన హైదరాబాద్ కు చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ ముంబైలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఈయన నటి తమన్న ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో కలిసిన నటించారు. ఇక వీరిద్దరి ప్రేమలో ఉన్న సంగతి తెలిసినదే.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన సినీ కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు. సినిమా అవకాశాల కోసం తాను ఎన్నో స్టూడియోలో చుట్టు తిరగానని, ఎంతోమందికి ఫోటోలు కూడా పంపించానని తెలిపారు. కొంతమంది తన ఫోటోలను రిజెక్ట్ చేసేవారు మరి కొంతమంది సినిమా అవకాశాలు ఇచ్చిన తర్వాత తెలిపారు.

ఇక ఒక దర్శకుడు అయితే సినిమా అవకాశం ఇచ్చి తనని రిజెక్ట్ చేశారు కానీ ఎందుకు రిజెక్ట్ చేసారనే విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసిందని తెలిపారు. ఆ డైరక్టర్ జ్యోతిష్యుడికి నేను నచ్చలేదని ఆయన చెప్పడం వల్లే దర్శకుడు కూడా ఆ సినిమాలో రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇలా సినీ కెరియర్ లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ధైర్యం చెప్పారు.

చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొవాలని ఆయన నాతో అన్నారు. ఏదీ అంత సులభంగా రాదని చెప్పినటువంటి మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఇలా ఎంతో కష్టపడి అవకాశాల కోసం ఎదురు చూశానని చివరికి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను అంటూ (Vijay Varma) విజయ్ వర్మ తెలిపారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus