ఫ్యాన్సీ రెమ్యూనరేషన్…స్టార్ హీరోయిన్స్ కి మించి

పదమూడేళ్ల తరువాత విజయశాంతి ఓ చిత్రం కోసం మేకప్ వేసుకున్నారు. రాజకీయాలలో ఉన్నప్పటికీ నటించడానికి ఒప్పుకున్నారు.స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి ఇమేజ్.. ఓ దశలో చిరంజీవి, బాలయ్య వంటి స్టార్స్ స్థాయికి చేరుకుంది.దీనితో 90లలోనే ఆమె లేడీ ఓరియెంట్ చిత్రాలకు బెస్ట్ ఛాయిస్ గా మారిపోయారు.ఒక వేళ ఏదైనా స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించినా, హీరోకి సమానంగా ఫైట్స్, స్క్రీన్ స్పేస్ ఉండేటట్టు దర్శకులు విజయశాంతి పాత్రను డిజైన్ చేసేవారు. రాజకీయాలలోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టే వరకు ఆమె పదుల సంఖ్యలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించారు. 2006లో వచ్చిన నాయుడమ్మ ఆమె చివరి చిత్రం.

మరి ఇన్నేళ్ల తరువాత ఆమె సరిలేరు నీకెవ్వరు చిత్రం లో నటించడానికి కారణం ఏమైయుంటుంది అనేదానికి చిత్ర యూనిట్ కథా.. కాకరకాయ అంటూ అనేక మాటలు చెవుతున్నారు.ఐతే విజయశాంతి తన సిద్ధాంతం పక్కన పెట్టి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించడానికి అసలు కారణం, పారితోషికమే అని తెలుస్తుంది. తాజా ఇంటర్వ్యూ లో ఆమె తన రెమ్యూనరేషన్ గురించి ఓ హింట్ ఇచ్చారు. తన రెమ్యూనరేషన్ ఎంత అంటే ఈ చిత్రంలో మహేష్ పారితోషికం తరువాత నాదే ఎక్కువ మొత్తం అని చెప్పారు.దీని ప్రకారం ఆలోచిస్తే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ రష్మిక రెమ్యూనరేషన్ కంటే విజయ శాంతి ఎక్కువ తీసుకున్నట్టు లెక్క. రష్మిక కు ఇప్పుడు ఉన్న డిమాండ్ రీత్యా కోటి నుండి కోటిన్నర మధ్య ఉండే అవకాశం కలదు.కాబట్టి విజయ శాంతికి ఈ పాత్ర కోసం కోటిన్నర నుండి రెండు కోట్లు చెల్లించి ఉండవచ్చు. అంత పెద్ద మొత్తంలో చెల్లించి ఆమెను ఒప్పించి వుంటారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus