ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న నటులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు వేర్వేరు పేర్లతో నేటికీ అమలవుతూ ఉండటం గమనార్హం. విజయశాంతి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 100 సంవత్సరాలు అయినా మరో 100 సంవత్సరాలు అయినా సినిమాకు ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే అని విజయశాంతి కామెంట్లు చేశారు. సినిమా రంగంలో పని చేసే కళాకారులకు సీనియర్ ఎన్టీఆర్ నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే అని విజయశాంతి చెప్పుకొచ్చారు.
14 సంవత్సరాల వయస్సులో తన సినీ కెరీర్ మొదలైందని విజయశాంతి కామెంట్లు చేశారు. సత్యం శివం సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కు చెల్లెలిగా నటించే అవకాశం దక్కిందని ఆమె పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతిఘటన మూవీకి నంది అవార్డ్ అందుకున్నానని విజయశాంతి తెలిపారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ డబ్బింగ్ సమయంలో నేను ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్లగా లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో సీనియర్ ఎన్టీఆర్ గారు నన్ను గమనించలేదని ఆమె అన్నారు.
ఈ విషయాన్ని తర్వాత తెలుసుకున్న ఎన్టీఆర్ మరుసటిరోజు ఉదయాన్నే మా ఇంటికి వచ్చారని విజయశాంతి తెలిపారు. ఆ సమయంలో నేను ఇంట్లో లేనని ఎన్టీఆర్ గారు అమ్మాయిని మేము చూసుకోలేదని పొరపాటు జరిగిందని ఐయామ్ సారీ, బిడ్డకు చెప్పండి అని శ్రీనివాస్ ప్రసాద్ గారికి చెప్పిన సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేనని ఆమె అన్నారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు నాకు ఫోన్ చేసి “జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా.. ఎక్స్ట్రీమ్లీ సారీ” అని చెప్పారని విజయశాంతి కామెంట్లు చేశారు.
సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను మరిచిపోని సీనియర్ ఎన్టీఆర్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని ఆమె చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ గారు ఆతిథ్యానికి మారుపేరని ఆయనే స్వయంగా టిఫిన్ వడ్డించేవారని విజయశాంతి (Vijayashanti) కామెంట్లు చేశారు.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!