Mahesh, Rajamouli: మహేష్‌ – జక్కన్న మూవీపై విజయేంద్రప్రసాద్‌ కామెంట్స్‌!

రాజమౌళి – మహేష్‌బాబు సినిమా.. టాలీవుడ్‌లో గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. మహేష్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాను సైతం పక్కన పెట్టేసి మహేష్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమా గురించి చూస్తున్నారు. దానికి కారణం ఆ కాంబినేషన్‌, దర్శకుడు చెబుతున్న నేపథ్యం.. ఇంకా చాలానే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్‌, అడ్వెంచర్‌ కథలో మహేష్‌బాబు నటించనున్నాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబు లాంటి నటుడికి కథ రాయాలని చాలా మంది రచయితలు అనుకుంటారు’’ అని అన్నారు. దీంతో ‘మా మహేష్‌ గురించి జక్కన్న తండ్రి ఏమన్నారో చూశారా?’ అంటూ ఫ్యాన్స్‌ ఎగ్జైట్‌ అవుతున్నారు. మహేష్‌లో ఓ ఇంటెన్సిటీ ఉంటుంది.

అతను నటించిన యాక్షన్‌ సన్నివేశాలు చూస్తే ఆ ఇంటెన్సిటీ కనిపిస్తుంది.‌ ఎన్నో రోజుల నుండి రాజమౌళి ఓ సాహసోపేతమైన కథను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. ఈ కథకు మహేశ్‌ సరిగ్గా సరిపోతాడని అతనిని ఎంపిక చేసుకున్నాడు అని మహేష్‌ అభిమానులకు కిక్‌ ఇచ్చే న్యూస్‌ చెప్పారు విజయేంద్రప్రసాద్‌. అంతేకాదు మహేష్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ కథను రాశానని కూడా చెప్పారాయన. మహేష్‌ బాబు సినిమా షూటింగ్‌ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో చేయాలని అనుకుంటున్నాం.

అందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జూన్‌ నాటికి షూటింగ్‌ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని విజయేంద్రప్రసాద్‌ చెప్పారు. రాజమౌళి ఇప్పటికే ఈ సినిమాకు ఇవ్వాల్సిన హైప్‌ ఇచ్చేశాడు. గ్లోబల్‌ ట్రాటింగ్‌ మూవీ అంటూ బజ్‌ పెంచేశారు. కేఎల్‌ నారాయణ నిర్మాణంలో తెరకెక్కున్న ఈ సినిమా కోసం మహేష్‌ అభిమానులే కాదు.. మొత్తం సినిమా ప్రపంచం ఎదురుచూస్తోంది. ‘ఆర్‌ఆర్ఆర్‌’తో భారతీయ సినిమా ఓ హైట్‌లో కూర్చోబెట్టిన జక్కన్న ఈ సినిమాతో ఎన్ని ఘనతలు సాధిస్తారో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus