టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకోగా రాజమౌళి స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమా ఆలస్యమవుతోంది. ఈ సినిమా కథకు సంబంధించి ఇప్పటికే కొన్ని వార్తలు వైరల్ కాగా మహేష్ రాజమౌళి సినిమా నిర్మాత కేఎల్ నారాయణ ఆ వార్తలు గాలి వార్తలు అని చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా అలీతో సరదాగా షోకు హాజరైన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కథకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ కు కథ రాయడం కష్టమని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సలహా తీసుకుంటే మాత్రమే మహేష్ కు కథ రాయడం సాధ్యమని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తారో చూడాల్సి ఉంది.
సాధారణంగా రాజమౌళి తన హీరోలతో రిస్కీ సీన్స్ ఎక్కువగా చేస్తారు. అయితే మహేష్ మాత్రం తన సినీ కెరీర్ లో ఎక్కువగా రిస్కీ సన్నివేశాల్లో నటించలేదు. ఆర్ఆర్ఆర్ అంచనాలను మించి సక్సెస్ సాధిస్తే మహేష్ రాజమౌళి మూవీ 550 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం మహేష్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. రాజమౌళి రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!