ప్రముఖ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజియేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైనమైట్ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఛానెల్ లో అలీ నిర్వహిస్తోన్న షోలో గెస్ట్ గా కనిపించారు విజయేంద్ర ప్రసాద్. ఈ షో ఆయన ఎన్నో విషయాలపై మాట్లాడారు. రాజమౌళి సినిమాల గురించి, పూర్తి జగన్నాథ్ గురించి విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
ఇదిలా ఉండగా.. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ ను పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించాడు అలీ. దానికి ఆయన పవన్ కళ్యాణ్ కి కథ రాయక్కర్లేదని అన్నారు. దీంతో షాకైన అలీ మరింత వివరంగా అడగగా.. విజయేంద్రప్రసాద్ తన వెర్షన్ చెప్పుకొచ్చారు. పవన్ నటించిన సినిమాల్లోనే అక్కడక్కడా కొన్ని సీన్స్ తీసుకొని కథ రెడీ చేసుకోవచ్చని.. పవన్ ని చూడడానికే జనాలు థియేటర్లకు వస్తారని.. కథ పట్టించుకోరని అన్నారు.
విలన్లను కొట్టడం, డాన్స్ లు చేయడం. అక్కడక్కడా కొంచెం ఫన్, ప్రజలకు మంచి చేయడం.. ఈ అంశాలు ఉంటే చాలు.. పవన్ తో సినిమా తీసేయొచ్చని అన్నారు. ఎందుకంటే డైనమైట్ ను పీల్చడానికి చిన్న అగ్గిపుల్ల చాలని.. ఆయన పెద్ద డైనమైట్ అని.. అలాంటి వ్యక్తితో సినిమా చేసేప్పుడు కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని పవన్ గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కథ అందిస్తున్నారు.