ఇండియాలో భారీ డిమాండ్ ఉన్న రైటర్స్ లో విజయేంద్రప్రసాద్ ఒకరు. ‘బాహుబలి’, ‘భజరంగి భాయీజాన్’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో ఆయన కీర్తి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఎనభై ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుకుగా కనిపిస్తూ.. కొత్త సినిమాలకు కథలు రాస్తూ బిజీగా గడుపుతున్నారు విజయేంద్రప్రసాద్. ఇటీవల మోడీ ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం కథను రాసే పనిలో ఉన్నారు.
దాంతో పాటు రజాకార్ల నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమాకి కూడా విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండడం విశేషం. ఈ క్రమంలో సినిమా చేయడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ.. ఏదీ వర్కవుట్ కాలేదు. చివరికి సుకుమార్ సైతం తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల మీద రీసెర్చ్ చేసి ఓ కథ రెడీ చేయాలని గతంలో అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు విజయేంద్రప్రసాద్ ఈ బాధ్యతలు తీసుకున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం విజయేంద్రప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేయడం..
ఆ పార్టీ నేతలు ఇటీవల ఆయన్ను కలవడంతో.. ఇదే సమయంలో ఈ సినిమా గురించి విజయేంద్రప్రసాద్ చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బీజేపీ నేతలు చెప్పడం వలనే ఈ సినిమా తెరకెక్కుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాతో వారికి సంబంధం లేదని.. నిర్మాతలు ఎవరో త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. ఈ సినిమాకి కథ మాత్రమే అందిస్తానని.. డైరెక్ట్ చేయనని స్పష్టం చేశారు.
తను తీసిన ‘భజరంగి భాయిజాన్’ సినిమాలో పాకిస్థాన్ నుండి ఇండియాకి వచ్చిన ఓ చిన్నపాప ఇక్కడ తప్పిపోతే, హీరో ఆమెను ఎలా తిరిగి తన ఇంటికి చేర్చాడన్నదే ఆ సినిమా కథ. దీనికోసం ఆయన పాకిస్థాన్‌తో ఎలాంటి యుద్ధం చేయలేదు. రజాకార్ల నేపథ్యంలో తను చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్పారు. ఈ సినిమా చూసిన తరువాత జనం కళ్లనీళ్లతో బయటకు రావాలి.. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పారు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!