తమిళ హీరో విజయ్ గత కొంతకాలంగా సౌత్ ఇండస్ట్రీలో తన మార్కెట్ ను అమితంగా పెంచుకుంటున్నాడు. ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపును అందుకున్న రజనీకాంత్ కంటే కూడా విజయ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండడం విశేషం. అతనికి పోటీగా ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ఎవరు లేరు అని చెప్పాలి. విజయ్ సినిమా అంటే ప్రస్తుతం మినిమం 300 కోట్ల బిజినెస్ జరుగుతుంది అనే తరహాలో టాక్ వస్తోంది.
Click Here To Watch NEW Trailer
కరెక్టుగా అనుకున్నట్లుగా జరిగితే ఆ లెక్కలు నాలుగు వందల కోట్లకు చేరే అవకాశం ఉంటుంది. ఇక విజయ్ కూడా తెలుగులో తన మార్కెట్ను పెంచుకోవాలి అని గత కొంతకాలంగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా విజయ్ తుపాకి సినిమా నుంచి తెలుగులో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు మరికొంత అతనికి మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాయి. ఇక గత ఏడాది వచ్చిన మాస్టర్ సినిమాతో విజయ్ కు తెలుగులో పది కోట్ల మార్కెట్ అయితే ఏర్పడినట్లు క్లారిటీగా అర్థం అయింది.
ఇక ఇప్పుడు రాబోయే బీస్ట్ తెలుగులో మంచి బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సురేష్ బాబు అలాగే ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తెలుగు హక్కులను సంయుక్తంగా 11 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 13వ తేదీన విడుదల చేయబోతున్నారు. అయితే పోటీగా కేజీఎఫ్ 2 కూడా ఆ తర్వాత రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఇలాంటి పోటీలో బీస్ట్ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అనేది ఆసక్తిని రేపుతోంది.
అసలైతే మొదట ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు కానీ అదే రోజున KGF 2 సినిమా వస్తోందని ఒకేరోజు విఫుదలైతే బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి విజయ్ ఒకరోజు ముందుగానే వస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మంచి లాభాలను అందిస్తుందో చూడాలి.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!