Vikram, Surya: నిర్మాతగానూ సూర్యను నిండా ముంచేసిన ‘శివపుత్రుడు’ డైరెక్టర్ బాలా.. అసలు కారణం అదేనంట..!

డైరెక్టర్ బాల.. ఫస్ట్ ఫిలిం ‘సేతు’ (శేషు) తో కోలీవుడ్ ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్నాడు. తమిళ్‌తో పాటు, తెలుగులోనూ తన సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. ‘శివపుత్రుడు’, ‘నేను దేవుణ్ణి’, ‘వాడు – వీడు’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. టాలెంటెడ్ రైటర్, డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన బాలా పేరు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వినిపిస్తూనే ఉంటుంది.. దీంతో పాటు కొద్ది కాలంగా తన నుండి సరైన సినిమా పడకపోవడంతో వార్తల్లో నిలుస్తున్నాడు..

చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అయిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘వర్మ’ సినిమాను మధ్యలో వదిలేశాడు.. తర్వాత వేరే దర్శకుడితో ‘ఆదిత్య వర్మ’ గా తీశారు. ఇప్పుడు వెర్సటైల్ యాక్టర్ సూర్య చిత్రం కూడా క్యాన్సిల్ అయిపోయింది. వీళ్లిద్దరితో ‘శివపుత్రుడు’ తీసి ఇప్పుడిద్దరికీ హ్యాండ్ ఇచ్చాడు బాలా. సూర్య – బాలా కాంబోలో ‘నంద’, ‘శివపుత్రుడు’ లాంటి అద్భుతమైన సినిమాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా ‘వనంగాన్’.. (తెలుగులో అచలుడు) ప్రకటిస్తూ.. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు సూర్య, జ్యోతిక ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. కన్యాకుమారిలో షూటింగ్ కూడా మొదలైంది. ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఇప్పుడు సూర్య ఈ ప్రాజెక్టు నుండి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ బాలానే బయటపెట్టాడు. తొలి షెడ్యూల్ కన్యాకుమారిలో భారీ సెట్ వేసి షూట్ చేశారు.. రెండో షెడ్యూల్ ప్రారంభించాల్సి ఉండగా.. సూర్య, బాలా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని తెలుస్తోంది.

దీని వల్ల పరస్పర అంగీకారంతోనే.. సూర్య ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. అయితే సూర్య వెళ్లిపోయినప్పటికీ సినిమా ఆగలేదని, ఆ ప్లేసులో మరో హీరో నటిస్తారని బాలా క్లారిటీ ఇచ్చాడు. బడ్జెట్ లిమిట్ దాటెయ్యడం, షెడ్యూల్స్ వాయిదా పడుతుండటం కారణంగా.. సూర్య బయటకొచ్చేశాడంటూ తమిళనాట న్యూస్ వైరల్ అవుతోంది.. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఫస్ట్ కోలీవుడ్ ఎంట్రీ మూవీ ఇది. సూర్య ప్లేసులో మరో హీరో నటించడం సంగతి ఓకే కానీ కథానాయికగా కృతినే కంటిన్యూ చేస్తారో లేదో మరి..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus