ఎనిమిదేళ్ల క్రితం సినిమా.. జనాలు చూస్తారా..?

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన సినిమా ఎనిమిదేళ్లుగా రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశారు. 2016లో విక్రమ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ‘ధృవ నచ్చత్తిరమ్’ అనే సినిమా మొదలైంది. ముందుగా సూర్య హీరోగా ఈ సినిమా అనుకున్నారు. కానీ ఆ తరువాత కాంబినేషన్ సెట్ కాకపోవడంతో ఫైనల్ గా విక్రమ్ ను హీరోగా సినిమాను మొదలుపెట్టారు. ఏడు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు.

భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. గౌతమ్ మీనన్ తో పాటు మరో ముగ్గురు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ఇందులో ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతూవర్మ హీరోయిన్ గా నటించింది. హారీస్ జైరాజ్ సంగీతం అందించారు. ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్తీబన్, అర్జున్ దాస్, రాధికా శరత్ కుమార్ లాంటి పేరున్న నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. అలాంటి ప్రాజెక్ట్ ఆర్థిక కారణాల వలన ఆలస్యమైంది.

గౌతమ్ మీనన్ కూడా ఒక పాయింట్ తరువాత ఈ ప్రాజెక్ట్ ని లైట్ తీసుకోవడంతో.. సినిమా అటకెక్కింది. ఆ తరువాత గౌతమ్ మీనన్ నటుడిగా బిజీ అయ్యారు. మరోపక్క విక్రమ్ ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’ హిట్ అవ్వడంతో విక్రమ్ ‘ధృవ నచ్చత్తిరమ్’ సినిమా ముందుకు కదులుతోంది. చెన్నైలో ఈ సినిమాకి సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేశారు.

పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తారట. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కానుంది. అయితే దాదాపు 8 ఏళ్ల తరువాత ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో.. ఎంతవరకు వర్కవుట్ అవుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. థియేటర్లో చూస్తే గానీ ఈ సినిమా సంగతి చెప్పలేం. మరి దీంతో విక్రమ్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి!

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus