Vikram Twitter Review: కమల్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ అట..!

దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ నుండీ వస్తున్న చిత్రం విక్రమ్.తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై స్వయంగా కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించడం ఒక విశేషమైతే… మహా నగరం, ఖైధీ, మాస్టర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో విశేషం. అంతే కాదు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య వంటి స్టార్ హీరోలు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించడం అందరినీ ఆకర్షించే అంశం.ఈరోజు అంటే జూన్ 3 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన కొంతమంది ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో కమల్ నటన అద్భుతం అట. అతనికి పోటీ ఇచ్చేలా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా అద్భుతంగా నటించారని, క్లైమాక్స్ లో సూర్య కేమియో ఉంటుందని అది కూడా మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందని కొందరు నెటిజన్లు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. టోటల్ గా ఈ మూవీ ఓ ఐ ఫీస్ట్ లా, అలాగే కే.జి.ఎఫ్ రేంజ్ లో ఉంటుందని కూడా చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి టాక్ వినిపిస్తుందో చూడాలి.

Click Here For Filmy Focus Review

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus