Mokshagnya: మోక్షజ్ఞని ఢీకొట్టే విలన్ గా దృవ్ విక్రమ్.. !

నందమూరి బాలకృష్ణ  (Balakrishna)  తనయుడు మోక్షజ్ఞ తేజ  (Nandamuri Mokshagnya) డెబ్యూ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూశారు. మొత్తానికి ఈ ఏడాది వారి ఎదురు చూపులు ఫలించాయి అని చెప్పాలి. మోక్షజ్ఞ  డెబ్యూకి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ ఏడాది వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మోక్షజ్ఞ. ఇది ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్(పీవీసీయు) లో భాగమే అని కూడా స్పష్టం చేశారు. హీరోయిన్ గా రవీనా టాండన్ కూతురు రషా తడానీ ఎంపికైనట్టు సమాచారం.

Mokshagnya

ఇక విలన్ కోసం ఇప్పటివరకు చర్చలు జరిగాయి. దానికి కూడా ఓ స్టార్ మెటీరియల్ కావాలని భావించి ప్రశాంత్ వర్మ గాలింపులు మొదలుపెట్టినట్టు సమాచారం. ఫైనల్ గా విక్రమ్ (Vikram) కొడుకుని ఫిక్స్ చేసినట్లు సమాచారం. అవును.. వివరాల్లోకి వెళితే.. మోక్షజ్ఞకి (Mokshagnya) ప్రతినాయకుడిగా ధృవ్ విక్రమ్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దృవ్ విక్రమ్ ఇప్పటివరకు తెలుగులో సినిమాలు చేయలేదు. కోలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) రీమేక్ ‘ఆదిత్య వర్మ’ తో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ‘మహాన్’ అనే సినిమాలో తన తండ్రి విక్రమ్ తో కలిసి నటించాడు. ఇక ‘హాయ్ నాన్న’ (Hi Nanna)  సినిమాలో ‘ఒడియమ్మ’ అనే పాటని పాడాడు. టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. ఇప్పుడు విలన్ పాత్రతో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లభించింది.

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ‘ఎస్.ఎల్.వి క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆయన కుమార్తె తేజస్విని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. బాలకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇది కూడా మైథలాజికల్ టచ్ ఉన్న మూవీనే కావడం విశేషం.

2024లో ఎవరు చూడని నష్టం చూశా: విశ్వప్రసాద్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus