పాపం తాను నటుడిగా ఎంత కష్టపడుతున్నా సరైన విజయం దక్కడం లేదని అసలే చాలాకాలంగా బాధపడుతున్న విక్రమ్ ప్రయోగాల జోలికి పోకుండా నటించిన పక్కా కమర్షియల్ సినిమా “మిస్టర్ కెకె”. నేటివ్ షేడ్స్ ఉన్న పాజిటివ్ రోల్లో విక్రమ్ ఈ సినిమాలో నటించాడు. తెలుగులో ఈ సినిమాకి ఆశించిన స్థాయి రెస్పాన్స్ లభించలేదు. పైగా.. శుక్రవారం విడుదలైన ఈ సినిమాను ఆదివారానికే చాలా థియేటర్ల నుండి తొలగించి ఆ స్థానంలో “ఇస్మార్ట్ శంకర్, ఓ బేబీ” సినిమాలు ఆడించారు. రివ్యూలు కూడా పాజిటివ్ గా రాలేదు. ఇవన్నీ తట్టుకొని కాస్త నిలదొక్కుకుంటున్న తరుణంలో మలేసియాలో ఈ సినిమాని బ్యాన్ చేయడం పెద్ద సమస్యగా మారింది.
తమిళ సినిమాలు మలేసియాలో ఇరగాడేస్తుంటాయి. అందుకు కారణం అక్కడ తమిళులు ఎక్కువగా ఉండడమే. అయితే.. “మిస్టర్ కెకె” సినిమాలో మలేసియాన్ పోలీసులను తప్పుగా చూపించారనే కారణం చేత ఆ సినిమాను అక్కడ బ్యాన్ చేశారు. దాంతో మలేసియాలోని విక్రమ్ ఫ్యాన్స్ కొందరు సింగపూర్ వెళ్ళి సినిమా చూడాల్సి వస్తోందట. పాపం.. ఆల్రెడీ ప్రొడక్షన్ టీం మలేసియాన్ పోలీసులకు సారీ చెప్పినా పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. మరి విక్రమ్ సుడి అలా ఉంది.