Ram, Aadhi: ‘ది వారియర్’ లో కూడా విలన్ డామినేషన్ ఉందా..?

రామ్ హీరోగా తెరకెక్కిన ‘ది వారియర్’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై విడుదలకు ముందు నుండి హైప్ ను పెంచాయి. తెలుగులో ఓ మంచి యాక్షన్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. రామ్ కు జూలై నెలలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే హిట్టు పడింది. కాబట్టి… ‘ది వారియర్’ చిత్రం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది అని అంతా భావించారు. ఈరోజు విడుదలైన ‘ది వారియర్’ చిత్రానికి డివైడ్ టాక్ నమోదవుతుంది.

కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి ఈ మధ్య కాలంలో ఫామ్లో లేడు. ‘ది వారియర్’ మూవీ ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. అలా అని ఇది పూర్తిగా తీసి పారేసే సినిమా అయితే కాదు. కొన్ని సీన్లు బాగున్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఒక సినిమా, సెకండ్ హాఫ్ లో ఇంకో సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అన్నిటికీ మించి హీరో రామ్ ని.. విలన్ గా చేసిన ఆది పాత్ర బాగా డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.

‘ది వారియర్’ చిత్రం కోసం రామ్ ఎంత కష్టపడి.. బాడీ పెంచినా.. ఎందుకో ఆది కటౌట్ ముందు చిన్నగా కనిపిస్తాడు. అంతేకాదు ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా ఆదికి ఎలివేషన్ సీన్స్ ఉండటం, హీరో రామ్ ని చితక్కొట్టినట్టు ఓ ఫైట్ పెట్టడం.. ఇవన్నీ మనకు ‘రెబల్’ రోజులను గుర్తు చేస్తాయి. రామ్ తమిళ్ లో డెబ్యూ ఇస్తున్నాడు కాబట్టి.. దర్శకుడు విలన్ ని హైలెట్ చేసినట్టు స్పష్టమవుతుంది. మాస్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేస్తారు..

రామ్ అభిమానులు మాత్రం ఈ సన్నివేశాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలయ్యే అవకాశం ఉంది. రామ్ అనే కాదు… గతంలో ‘స్పైడర్’ లో మహేష్ బాబు, ‘మాస్టర్’ లో విజయ్.. వంటి హీరోలను కూడా విలన్లు డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాలో ‘తమిళ దర్శకులకు హీరోల పై కంటే విలన్ల పైనే ప్రేమ ఎక్కువ’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus