నాగ్ తో విమలా రామన్..!

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో శ్రీ వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడు బాబా హతీరామ్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఓం నమో వెంకటేశ’చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో నటీనటుల ఎంపికలో రాఘవేంద్ర రావు బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్ ను ఎంపిక చేయగా..

తాజాగా విమలా రామన్ ను కూడా ఈ చిత్రం ఓ పాత్ర కోసం ఎంపిక చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే దర్శకేంద్రుడ్ని కలిసిన విమలా.. ఈ చిత్రంలో తన పాత్ర నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి ఆమె అంగీకారం తెలిపిందని అంటున్నారు. విమలా రామన్ చివరి సారి గా ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ చిత్రం లో నటించగా.. ఇటీవలే నాగార్జున సరసన ఓ జ్యూవెలరీ యాడ్ లో నటించింది. ప్రస్తుతం విమలా.. మోహన్ లాల్ సరసన ‘ఒప్పమ్’ అనే చిత్రంలో నటిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus