Vimanam Review In Telugu: విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 9, 2023 / 03:07 PM IST

Cast & Crew

  • సుముద్రఖని (Hero)
  • అనసూయ , మీరా జాస్మిన్ (Heroine)
  • మాస్టర్ ధృవన్, ధనరాజ్, రాహుల్ రామకృష్ణ, అనసూయ తదితరులు.. (Cast)
  • శివ ప్రసాద్ (Director)
  • జీ స్టూడియోస్ - కిరణ్ కొర్రపాటి (Producer)
  • చరణ్ అర్జున్ (Music)
  • వివేక్ కాలేపు (Cinematography)
  • Release Date : జూన్ 09, 2023

టీజర్ & ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా “విమానం”. సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తండ్రీకొడుకుల ఎమోషనల్ జర్నీగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (జూన్ 09) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఎమోషనల్ డ్రామా ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: వీరయ్య (సముద్రఖని) అంగవైకల్యం కారణంగా సులభ్ కాంప్లెక్స్ నడుపుతూ.. వచ్చిన కాసిన్ని డబ్బులతో కొడుకు రాజు (మాస్టర్ ధృవన్)ను చదివించుకుంటూ జీవితాన్ని సాగిస్తుంటాడు. రాజుకి ఎందుకో విమానం అంటే పిచ్చి. పెద్దయ్యాక పైలట్ అవ్వాలని కలలు కంటుంటాడు. ఊహించని విధంగా ఆ కలలన్నీ ఒక్కసారిగా చెదిరిపోతాయి. ఏమిటా కారణం? రాజు ఫ్లైట్ ఎక్కగలిగాడా? అనేది “విమానం” కథాంశం.

నటీనటుల పనితీరు: బీద తండ్రి వీరయ్య పాత్రలో సముద్రఖని జీవించేశాడు. అలాగే సినిమా మొత్తం అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా నటించడానికి అతడు పడిన కష్టం ప్రశంసనీయం. కొడుకు రాజు పాత్రలో మాస్టర్ ధృవన్ చక్కగా నటించాడు. అతడి కళ్ళల్లో నిజాయితీ తొణికిసలాడుతుంది. అతడి అమాయకత్వం, హావభావాలు సినిమాకి మంచి ఎమోషన్ ను యాడ్ చేసింది.

అనసూయ నటనతో కంటే అందంతో ఆకట్టుకోవడానికే ఎక్కువ ప్రయత్నించింది. ఓ మేరకు విజయం సాధించింది కూడా. కాకపోతే.. ఆ పాత్రకు చివర్లో ఇచ్చిన జస్టిఫికేషన్ ఆ పాత్రకి అప్పటివరకూ బిల్డ్ అయిన ఎలివేషన్ ను కిల్ చేసింది. ధనరాజ్, రాహుల్ రామకృష్ణ తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: చరణ్ అర్జున్ పాటలు & నేపధ్య సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి. అయితే.. సినిమాకి హైప్ తెచ్చిన అనసూయ పాటను జస్ట్ మాంటేజ్ కి సరిపెట్టకుండా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ, లైటింగ్ & కలర్ గ్రేడింగ్ వంటి టెక్నికాలిటీస్ లో క్వాలిటీ లోపించింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ తమకు కేటాయించిన బడ్జెట్ లో పర్వాలేదనిపించుకున్నారు.

దర్శకుడు శివ ప్రసాద్ రాసుకున్న కథలో మంచి ఫీల్ ఉంది. కానీ.. కథనంలో అది లోపించింది. చిన్న పాయింట్ ను సినిమాగా ఎలా కన్వర్ట్ చేయాలో తోచక, అనవసరమైన సబ్ ప్లాట్ తో, సినిమా జోనర్ తో సింక్ అవ్వని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో సాగదీసి, కథకుడిగా విఫలమయ్యాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ను ఇంకాస్త నీట్ గా డీల్ చేసి ఉండొచ్చు. అలాగే.. గ్రాఫిక్స్ మరీ షార్ట్ ఫిలిమ్ రేంజ్ లో ఉండడం కూడా బిగ్ స్క్రీన్ ఆడియన్స్ ను ఎగ్జైట్ చేయకపోవచ్చు.

విశ్లేషణ: ఒక ఎమోషనల్ డ్రామాకి కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది చాలా కీలకం. (Vimanam) “విమానం”లో ఆ కావాల్సిన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ ను డీల్ చేసిన విధానంలో ఎమోషన్ పండకపోవడంతో ప్రేక్షకులని అలరించలేక విమానం కూలబడింది.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus