సోమవారం సాయంత్రం ‘గీతా ఆర్ట్స్’ ట్విటర్ పేజీలో ఓ ఆసక్తికర పోస్ట్ కనిపించింది. అందులో ఏం రాశారు అనేది పక్కన పెడితే.. దాని అర్థం మాత్రం ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ. గీతా ఆర్ట్స్ ట్విటర్‌ను, కిరణ్ అబ్బవరం ట్విటర్‌ను ఆ మాటకొస్తే సినిమా జనాల ట్విటర్‌లను జాగ్రత్తగా ఫాలో అయితే ఆ ఆఫర్ గురించి ఇప్పటికే మీరు చదివి ఉంటారు. అయితే ఇప్పుడు ఆ ఆఫర్‌కి సంబంధించిన పోస్టులు ఏవీ కనిపించవు. ఎందుకంటే ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు కాబట్టి.
కిరణ్ అబ్బవరం హీరోగా గీతా ఆర్ట్స్ తెరకెక్కించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలైంది. టాక్ గురించి పక్కన పెడితే సినిమా కాన్సెప్ట్ వల్లనే టీమ్ ఎక్కువ బాధపడింది అని చెబుతారు. అయితే సినిమాకు వస్తున్న వసూళ్ల విషయంలో హ్యాపీగా ఉన్నామని చెబుతున్నా.. ఎక్కడో తేడా కొట్టింది అంటున్నారు. అందుకే సినిమాకు 1 + 1 ఆఫర్ పెట్టబోయారు. అయితే దానికి సినిమా కాన్సెప్ట్ కలిసేలా నెయిబర్ టికెట్ అనే మాట చెప్పారు.
అంటే ఒక సినిమా టికెట్ కొనుక్కుంటే పక్క సీటు మీకు ఫ్రీగా ఇస్తాం. ఆ లెక్కన ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్లొచ్చు అని చెప్పారు. అయితే ఏమైందో ఏమో కాసేపు ఆ పోస్టర్ కనిపించాక డిలీట్ చేసేశారు. మిగిలిన ట్విటర్ పేజీలు అప్పటికే ఆ పోస్టును షేర్ చేసేశాయి. దీంతో గీతా ఆర్ట్స్ టీమ్ ఆ ట్వీట్లను తొలగించే పనిలో పడింది.
చాలా కష్టపడి ఆ పని పూర్తి చేసింది గీతా ఆర్ట్స్ టీమ్. దీంతో అసలు ఎందుకు ప్రకటించడం, ఎందుకు ఆపేయడం అని నెటిజన్లు విసుక్కుంటున్నారు. ఇటీవల ‘రైటర్ పద్మభూషణ్’ టీమ్ కూడా ఉచిత టికెట్ ఆఫర్ ఇచ్చింది. వాళ్లకు బాగా వర్కవుట్ అయింది కూడా. మరి ‘వినరో భాగ్యము..’ ఎందుకు వెనక్కి తగ్గిందో.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?