విరాట పర్వం నుంచి మొదటి పాట వచ్చేస్తోంది..!

సోషల్ మీడియాలో సాయిపల్లవికి ఉన్న క్రేజే సపరేట్. అందులోనూ ఫిదాతో తెలుగు కుర్రహృదయాలని కొల్లగొట్టేసింది ఈ హైబ్రీడ్ పిల్ల. ఆ తర్వాత రౌడీ బేబీ అంటూ యూట్యూబ్ ని షేక్ చేసేసింది. పాటల్లో సాయిపల్లవి డ్యాన్స్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్నపిల్లల నుంచీ పెద్దవాళ్ల వరకూ సాయిపల్లవిని ఇమిటేట్ చేసేస్తుంటారు. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో దగ్గుబాటి రానాతో కలిసి విరాటపర్వం సినిమా చేస్తోంది. ఇందులో నక్సలైట్ పాత్రలో నటిస్తోంది.

ఇప్పుడు ఈసినిమా నుంచి చిత్రయూనిట్ మొదటి పాటని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అఫీషియల్ గా ఈ సాంగ్ ని ఫిబ్రవరి 25వ తేదిన రిలీజ్ చేయబోతున్నట్లుగా పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో సాయిపల్లవి ఎల్లో లంగాఓణీ వేసుకుని అందర్నీ ఫిదా చేసేస్తోంది. ‘కోలు కోలు’ అంటూ వచ్చే లిరికల్ సాంగ్ ని విడుదల చేయబోతోంది మూవీ టీమ్. ఇందులో సాయి పల్లవి తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేస్తుందనే అంటున్నారు.

ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదిన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సురేష్ బొబ్బులి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సాయిపల్లవి డ్యాన్స్ ఫోజ్ తో వచ్చిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. ఇప్పుడు ఈ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదీ విషయం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus