పోస్టర్ తో క్యూరియాసిటీ పెంచేసిన వర్జిన్ బాయ్స్!

ఈ సమ్మర్‌లో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తేందుకు ‘వర్జిన్ బాయ్స్’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ గురు ఫిలిమ్స్‌పై రాజా దరపునేని నిర్మిస్తుండగా, దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. యువతను ఆకర్షించే కథాంశంతో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. స్మరణ్ సాయి, మార్తాండ్ కె వెంకటేష్, వెంకట ప్రసాద్ వంటి టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు.

సినిమా పోస్టర్‌లో ఓ అమ్మాయి పెదాలపై ముగ్గురు యువకులు ఉన్నారు. ఒకరు కలర్‌ఫుల్ షార్ట్స్‌లో, మరొకరు స్కేట్‌బోర్డ్‌తో, ఇంకొకరు మ్యాగజైన్‌తో నవ్వుతూ కనిపించడం ఫన్ ఎలిమెంట్‌ను సూచిస్తోంది. ‘బ్రో.. ఆర్ యు వర్జిన్?’ అనే ట్యాగ్‌లైన్ యువతలో ఆసక్తి రేకెత్తిస్తోంది. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో నిండిన ఈ చిత్రం భారీ ప్రమోషన్‌లతో సమ్మర్‌లో విడుదల కానుంది. పోస్టర్ అంచనాలను పెంచుతూ బాక్సాఫీస్ విజయానికి సిద్ధమవుతోంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన రానుంది.

సినిమా పేరు: వర్జిన్ బాయ్స్
ఆర్టిస్టులు : గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్
డైరెక్టర్: దయానంద్
ప్రొడ్యూసర్ : రాజా దరపునేని
బ్యానర్ : రాజ్ గురు ఫిలిమ్స్
మ్యూజిక్ డైరెక్టర్: స్మరణ్ సాయి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
డీఓపి : వెంకట ప్రసాద్
పిఆర్ఓ : మధు VR

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus